ఈరోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు కలసి , కడప జిల్లా లో రైల్వే అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తన లేఖల ద్వారా తెలిపారు…..యర్రగుంట్ల రైల్వే స్టేషన్ను “అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” కింద అభివృద్ధి చేయాలని, అలాగే కడప రైల్వే స్టేషన్లో రెండు షిఫ్టుల్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని మరియు జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు.…..అలాగే నెల్లూరు నుండీ ఆత్మకూరు. బద్వేలు మీదుగా కడప వరకు నూతన రైల్వే లైన్ వెయ్యాలని కోరినారు Vinod Kumar


