సెప్టెంబర్ 3, 2026
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సహా మొత్తం ఏడు కీలక అంశాలపై ప్రతినిధులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం, నియోజకవర్గ స్థాయి అభివృద్ధి మరియు కేడర్తో అనుసంధానం కావడంపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. పార్టీ శ్రేణులను, ప్రజలను సమర్థవంతంగా నడిపించేందుకు ఉద్దేశించిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని టీడీపీ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 7, 8 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
సెప్టెంబర్ 3, 2026 తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సహా మొత్తం ఏడు కీలక అంశాలపై ప్రతినిధులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం, నియోజకవర్గ స్థాయి అభివృద్ధి మరియు కేడర్తో అనుసంధానం కావడంపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. పార్టీ శ్రేణులను, ప్రజలను సమర్థవంతంగా నడిపించేందుకు ఉద్దేశించిన ఈ రెండు రోజుల శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని టీడీపీ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

