ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతి నిధి)
ఇథనాల్ పరిశ్రమలు లేకపోతే మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర దక్కదని భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మండదపు రామారావు అన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగవుతున్నా రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉండటంతో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. దేశ అవసరాలకు మించి పంట దిగుబడులు వస్తున్న నేపథ్యంలో ఇథనాల్ వంటి పరిశ్రమల ద్వారానే రైతులకు లాభసాటి ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.
Uploaded Video:



