
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ముగ్ధంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు భువనగిరి అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ముగ్దంపళ్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతనంగా ఇండ్లు నిర్మించుకున్న జూపల్లి శంకరమ్మ ఇల్లును ఈరోజు గ్రామ సర్పంచ్ శిగ నరేశ్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకొని నూతన గృహాలలోకి అడుగుపెడుతున్న లబ్ధిదారులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి వాళ్లకు సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది పేద ప్రజల సొంతింటి కలను సహకారం చేస్తూ వారి ముఖాలలో ఆనందాన్ని చూడటం అత్యంత తృప్తినిచ్చిందని అన్నారు నూతన గృహాలలో అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆభగవంతున్ని ప్రార్థిస్తున్నాను శ్రీమతి ఇందిరా గాంధీ గారు గరీబి హటావో అనే నినాదంతో దేశ దేశవ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించిన ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ గారికి దక్కుతుందని ఆమె ఎంచుకున్న దారిలోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పేద ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతులు తినడానికి అన్నం నివసించడానికి ఇల్లు ధరించడానికి వస్త్రాలు వాటిలో అన్నిటికమైన ముఖ్యమైనది నివసించడానికి ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలతో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు అభినందనలు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో సెక్రటరీ శైలజ ఉపసర్పంచ్ శెట్టి సోనీ వార్డు మెంబర్లు మట్ట గోపికృష్ణ వడ్లకొండ బాలకృష్ణ బండారు సురేష్ మానస నాగరాజు గోరుగంటి జగపతి గణేష్ నరసింహ మట్ట జహంగీర్ ఆకుల వెంకటేష్ అంజయ్య బాల నరసింహ మహిళలు మట్ట యశోద శిగ గీత ఆకుల మమత ధనలక్ష్మి నిర్మల లింగమ్మ అంజమ్మ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది..

