Saturday, 2 May 2026
  • Home  
  • ఆధ్యాత్మిక కాంతిలో శ్రీకాళహస్తి-సద్విచారణ సదస్సు రెండో రోజు ఘనంగా
- తిరుపతి

ఆధ్యాత్మిక కాంతిలో శ్రీకాళహస్తి-సద్విచారణ సదస్సు రెండో రోజు ఘనంగా

శ్రీకాళహస్తి, మే 02 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మాశ్రమం సమీపంలోని శ్రీ చైతన్య క్షేత్రంలో, శ్రీ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సద్విచారణ జ్ఞాన సాధన సదస్సు’ రెండో రోజు శనివారం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగింది. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో భాగంగా రెండో రోజు కార్యక్రమానికి శ్రీరామ చైతన్య స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని భక్తులకు జ్ఞానబోధ చేశారు. రామలింగ ఆశ్రమ అధ్యక్షులు మౌన స్వామి మాట్లాడుతూ, జగద్గురు వేదాంతం లక్ష్మీనాచార్యులు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక ఆశయాలను శ్రీరామ చైతన్య స్వామి సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా బెంగళూరు, సోలాపూర్ వంటి ప్రాంతాల్లో అనేక మందిని బ్రహ్మవిద్యలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దిన సేవలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని అన్నారు. పరబ్రహ్మ ఆశ్రమ అధ్యక్షులు పరమాత్మ నందగిరి స్వామి వేదాంత సారాంశాన్ని, ధ్యాన సాధనలో పాటించాల్సిన నియమాలను భక్తులకు సులభంగా వివరించి ఆకట్టుకున్నారు. ప్రొద్దుటూరు శ్రీ స్వరాజ్య సంఘం అధ్యక్షులు వద్ది నరసింహులు మాట్లాడుతూ, శ్రీరామ చైతన్య స్వామి చిన్న వయస్సు నుంచే జ్ఞానాన్వేషణలో నిమగ్నమై, సుఖ బ్రహ్మాశ్రమంలో గీతా బోధకుడిగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. 1998లో చిన్న కుటీరంగా ప్రారంభమైన ఈ క్షేత్రం, నేడు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగడం ఆయన కృషి ఫలితమని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీరామ చైతన్య స్వామి మాట్లాడుతూ, భక్తులు మరియు శిష్యుల సహకారంతోనే ఆశ్రమం అభివృద్ధి సాధించిందని తెలిపారు. భవిష్యత్తులో ఈ క్షేత్రాన్ని సంపూర్ణ ధ్యాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు, మదనపల్లి, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.