వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా పేదలకు వైద్యం అందడం లేదని, కాబట్టి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించాలని డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ‘ప్రజారోగ్య వేదిక’, ‘శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యులు డాక్టర్ నాగమునెయ్య, డాక్టర్ సబిత, డాక్టర్ శోభారాణిలను ఘనంగా సన్మానించారు.
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి రమణయ్య మాట్లాడుతూ… ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు కావాలని, ‘ఆరోగ్య హక్కు చట్టాన్ని’ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను PPP పద్ధతిలో కాకుండా, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. డాక్టర్ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆరోగ్య హక్కు చట్టం’ తేవాలి
వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా పేదలకు వైద్యం అందడం లేదని, కాబట్టి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించాలని డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ‘ప్రజారోగ్య వేదిక’, ‘శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్యులు డాక్టర్ నాగమునెయ్య, డాక్టర్ సబిత, డాక్టర్ శోభారాణిలను ఘనంగా సన్మానించారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.వి రమణయ్య మాట్లాడుతూ… ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు కావాలని, ‘ఆరోగ్య హక్కు చట్టాన్ని’ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను PPP పద్ధతిలో కాకుండా, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. డాక్టర్ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

