మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ నందు 1990-1991 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ కలయిక ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించారు. ఉదయం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూర్వ విద్యార్థులు దర్శించుకుని అనంతరం భారీ ర్యాలీతో జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారు నీ కలిసి ఆశీర్వచనములు పొంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందిపుచ్చుకున్నారు.అనంతరం వారి సోదరుడు దత్తాత్రేయ స్వామి వారి తోటి మిత్రులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటో రుద్రాక్ష ప్రసాదలను అందజేశారు. అనంతరం జగన్మాత శ్రీ జగన్మాత అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ ఈశ్వరీ దేవి మఠం మఠాధిపతి శ్రీ వీర శివకుమార స్వామివారిని దర్శించి ఈ సందర్భంగా స్వాములవారు వారికి ప్రసాదలు అందజేశారు. అనంతరం ఐదు రోడ్ల కూడలి నుంచి డీజే తో నృత్యాలు చేసుకుంటూ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంసమావేశాన్ని కి ఆ స్కూలు ఇన్చార్జి హెడ్ మాస్టర్ నరసింహారెడ్డి అధ్యక్షత వహించి సభను ప్రారంభించారు. విద్యార్థినిలు జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా 1990 బ్యాచ్ ఉపాధ్యాయులు చలమయ్య, ఓబుల్ రెడ్డి చెన్నారెడ్డి సివి సుబ్బారెడ్డి హాజరయ్యారు.విశ్రాంతి ఉపాధ్యాయులు చలమయ్య మాట్లాడుతూ మా విద్యార్థులు ఒక సదుద్దేశముతో పూర్వ విద్యార్థుల కలయికను ఏర్పాటు చేసి నేను పనిచేసిన నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అదృష్టం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులంతా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు వారి ఉపాధ్యాయుడిగా నాకు గర్వంగా ఉందని తెలియజేశారు. అనంతరం ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా తమ బిడ్డ లాంటి వాళ్ళని వారీ ఎదుగుదల చూస్తుంటే తమ బిడ్డల ఎదుగుదల చూస్తున్నట్లుగా మనసు పులకరించిందని ఆనాడు నేను సైన్స్ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు విద్యాబోధన చేసి వారి జ్ఞానాన్ని పెంపొందించనని ఆ జ్ఞానపు వృక్షము నేడు ఇంతమంది ప్రయోజకులను చేసినందుకు ఉపాధ్యాయుడిగా నాకు గర్వంగా ఉందని ఆయన తెలిపారు. పూర్వపు విద్యార్థి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి సోదరులు శ్రీ దత్తాత్రేయ స్వామి మాట్లాడుతూ విద్య చాలా విలువైనదని విద్య లేనిదే మానవ మనుగడ లేదని విద్య పరులు దోచలేని సంపదని అలాంటి విద్యాబుద్ధులు మాకు నేర్పించిన మా గురువులను నేడు ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయిక నేడు వారిని కలిసి వారి ఆశీస్సులను పొందడం మా పూర్వజన్మ సుకృతం అని అన్నారు మరొక పూర్వ విద్యార్థి ఆవుల దస్తగిరి నాయుడు మాట్లాడుతూ తాము విద్యాబుద్ధులు నేర్చుకునే సమయంలో మా ఉపాధ్యాయులు మమ్మల్ని సన్మార్గంలో నడిపించడం కోసం వారు నిరంతరం కష్టపడి తమ విద్యార్థులు ప్రయోజకులు కావాలని మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తూ వారు అనేక రూపాలుగా మమ్మల్ని ప్రయోజకులు చేయడం కోసం కృషి చేశారని ఆనాటి కాలంలో తమకు లోక పరిజ్ఞానం తెలియకున్న లోకాన్ని లోకజ్ఞానాన్ని మాకు నేర్పించి మా అంధకారాన్ని తొలగించిన గొప్ప మార్గదర్శకులు మా గురువులని ఆయన కొనియాడారు అనంతరం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆర్గనైజర్ దుగ్గిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమతో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులంతా కూడా కలిసి ఒక చోటికి రావడం చాలా శుభదాయకమని ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం తామంతా ఈ పాఠశాలలో చదువుకొని వృత్తిరీత్యా అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డాము నేడు ఈ ఆత్మీయ కలయిక ద్వారా అందరం ఒకచోట కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి తమ గురువులైన చలమయ్య ఓబుల్ రెడ్డి చెన్నారెడ్డి సుబ్బారెడ్డి వారిని ఘనంగా పూలమాల శాలువతో సత్కరించి పట్టు వస్త్రాలను జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో పూర్వక విద్యార్థులు పాల్గొన్నారు.



