ఆత్మకూరు: ఆత్మకూరు రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ నూతన పెన్షన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు సుంకర పెంచలచౌదరి, నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం నూతన పెన్షన్ల మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు తదితర అర్హులు ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో సమీప సచివాలయంలో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ తుది గడువు అని తెలిపారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

అర్హులందరూ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి