రాబోయే పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో హోటల్ యాజమాన్యాలు, హోమ్‌స్టే నిర్వాహకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్యాటకులకు పరిశుభ్రమైన, నాణ్యమైన సేవలు, మెరుగైన సౌకర్యాలు, ఆతిథ్యపూర్వక వాతావరణం కల్పించాలని డీఆర్డీఏ పీఓ జైకృష్ణ, జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు సూచించారు. అరకు కాఫీ, ఆర్గానిక్ ఉత్పత్తులు, బాంబూ చికెన్, స్థానిక మిల్లెట్ ఉత్పత్తులను పర్యాటకులకు పరిచయం చేసి మరింత ప్రాచుర్యం కల్పించాలని తెలిపారు. వీటి ద్వారా స్థానిక ఉత్పత్తిదారులు, గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పర్యాటకులకు మెరుగైన అనుభవం అందించేందుకు సంబంధిత శాఖలు, హోటల్ యాజమాన్యాలు, హోమ్‌స్టే నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీసం ప్రసాద్, సీడీపీఓ లక్ష్మీ లావణ్య, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, ఏపీటీడీసీ మేనేజర్ దేవుడుబాబు, డివిజనల్ మేనేజర్ గణపతి పాల్గొన్నారు.

అరకు: పర్యాటక సీజన్‌కు హోటళ్లు, హోమ్‌స్టేల సన్నద్ధత