Friday, 25 September 2026
  • Home  
  • అరకు: షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన చేయాలి: సీపీఎం
- అల్లూరి సీతారామరాజు

అరకు: షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన చేయాలి: సీపీఎం

అరకులోయ మండలం, పెదలబుడు పంచాయతీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు బహిరంగ ప్రకటన జారీ చేసి, లాటరీ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ గిరిజన యువతకు దుకాణాలు కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు భూములు కోల్పోయిన స్థానిక యువతతో కలిసి తహశీల్దార్, ఈఓపీఆర్డీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పశుసంవర్ధక శాఖ స్థలంలోని 29, 30 ప్లాట్లలో 55 సెంట్ల భూమిలో నిర్మాణాలపై గతంలో ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలపై అప్పటి కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే బాధితులు, నిరుద్యోగ యువతతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిల్లో జగన్నాథం, కిలో సహదేవ్, తాంగుల హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.