అరకులోయ: పోషణ మాసం–2026లో భాగంగా శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య పోషకాహారం అందించడం, రక్తహీనత నివారణ, తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు, గుడ్లు, ఎండు ఖర్జూరం, చిక్కీ, రాగిపిండి, మల్టీ గ్రెయిన్ పౌడర్, కూరగాయలు, పండ్లను సూచించిన విధంగా వినియోగించుకోవాలని సూచించారు. శిశువులకు రెండేళ్ల వరకు తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు. కార్యక్రమం సీడీపీఓ లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో జరగగా, ఎంపీడీఓ వీసం ప్రసాద్, స్ధానిక పిర్యాధుల కమిటీ చైర్మన్ డా కమ్మిడి కృష్ణకుమారి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. SEEDS ప్రతినిధులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


