ఎర్పేడు, మే 05 (పున్నమి న్యూస్): ఎర్పేడు మండల పరిధిలోని అమండురు అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ‘కిశోర వికాసం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ రేణిగుంట ప్రాజెక్ట్ సీడీపీఓ కృష్ణవేణి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కిశోర బాలికలకు విద్య ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, జీవన నైపుణ్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మే 1 నుండి జూన్ 12 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ప్రత్యేక సదస్సులు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పోక్సో చట్టం, ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి కీలక అంశాలపై వివరణ ఇచ్చి బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె. రత్నమ్మ, మహిళా పోలీస్ రేణుక, అంగన్‌వాడీ కార్యకర్తలు సుమతి, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు.

అమండురులో ‘కిశోర వికాసం’ కార్యక్రమం-బాలికలకు అవగాహన