Monday, 17 August 2026
  • Home  
  • *అన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!*
- BHUPALPALLE

*అన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!*

*పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డిగారికి రాఖీ కట్టిన వరంగల్ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య* పరకాలలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభలో ఆత్మీయత, అనుబంధం వెల్లివిరిసింది. రక్షాబంధన్‌ సందర్భంగా వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వేడుక సభా ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాఖీ కట్టి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డా.కడియం కావ్య.. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అన్నగా అండగా నిలుస్తూ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రంగాల్లో సహకారం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు అమెరికా పర్యటనలో ఉండనున్న నేపథ్యంలో, పరకాల వేదికగా ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ఆయనకు ముందుగానే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన ఈ ఆత్మీయ దృశ్యం సభకు వచ్చిన ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘట్టం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

*పరకాల సభలో సీఎం రేవంత్‌రెడ్డిగారికి రాఖీ కట్టిన వరంగల్ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య*

పరకాలలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభలో ఆత్మీయత, అనుబంధం వెల్లివిరిసింది. రక్షాబంధన్‌ సందర్భంగా వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వేడుక సభా ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాఖీ కట్టి ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డా.కడియం కావ్య.. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అన్నగా అండగా నిలుస్తూ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రంగాల్లో సహకారం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు అమెరికా పర్యటనలో ఉండనున్న నేపథ్యంలో, పరకాల వేదికగా ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ఆయనకు ముందుగానే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన ఈ ఆత్మీయ దృశ్యం సభకు వచ్చిన ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘట్టం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.