అనకాపల్లి జిల్లా, ఆగస్టు 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా అనకాపల్లి జిల్లా స్థాయి క్రీడా ఎంపికలకు షెడ్యూల్ ఖరారైంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే 17 ఏళ్ల లోపు, 23 ఏళ్ల లోపు బాలురు, బాలికల విభాగాల్లో 12 క్రీడాంశాలకు సంబంధించిన ప్రాథమిక ఎంపికలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ తెలిపారు.
ఈ నెల 8వ తేదీన అనకాపల్లి ఎన్‌టీఆర్ స్టేడియంలో బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీ, చెస్, యోగ పోటీలు నిర్వహించనుండగా, అదే రోజు యలమంచిలి డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ ఎంపికలు జరగనున్నాయి. 10వ తేదీన జార్జి క్లబ్‌లో బ్యాడ్మింటన్ ఎంపికలు, అలాగే ఏఎంఏఎల్ కళాశాలలో ఖో-ఖో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పిలుపునిచ్చారు.

అనకాపల్లిలో ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ జిల్లా స్థాయి క్రీడా ఎంపికలకు షెడ్యూల్ విడుదల
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 5 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో భాగంగా అనకాపల్లి జిల్లా స్థాయి క్రీడా ఎంపికలకు షెడ్యూల్ ఖరారైంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే 17 ఏళ్ల లోపు, 23 ఏళ్ల లోపు బాలురు, బాలికల విభాగాల్లో 12 క్రీడాంశాలకు సంబంధించిన ప్రాథమిక ఎంపికలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ తెలిపారు. ఈ నెల 8వ తేదీన అనకాపల్లి ఎన్‌టీఆర్ స్టేడియంలో బాక్సింగ్, వాలీబాల్, కబడ్డీ, చెస్, యోగ పోటీలు నిర్వహించనుండగా, అదే రోజు యలమంచిలి డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ ఎంపికలు జరగనున్నాయి. 10వ తేదీన జార్జి క్లబ్‌లో బ్యాడ్మింటన్ ఎంపికలు, అలాగే ఏఎంఏఎల్ కళాశాలలో ఖో-ఖో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పిలుపునిచ్చారు.

