అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో గల ఇంటిగ్రేటెడ్ మానసిక వికలాంగుల పిల్లల ఆశ్రమం మరియు పాఠశాల నిర్వాహకులు నేతృత్వంలో పిల్లలు కు మాతృభూమి సేవా సంఘం మరియు VTC హెల్పింగ్ హాండ్స్ కలిసి10బస్తాలు బియ్యం, 15 kg లు ఆయిల్ డబ్బాలు రెండు,10 kg లు కందిపప్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు L.V. రమణ మూర్తి (ఉమ) మాట్లాడుతూమాతృభూమి సేవా సంఘం వ్యవస్థాపక కార్యదర్శిఇప్పలవలస గోపాలరావు సహాయ సహకారాలు తో ప్రతి నెలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మాతృభూమి సేవా సంఘం వ్యవస్థాపకులు ఇప్పలవలస గోపాలరావు మరియు సంస్థ సభ్యులు L.V. రమణ మూర్తి(ఉమ), అల్లకరాజు, రాజు,శ్రీనివాస్ రాజు, జగన్మోహన్ త్రినాథ్ పట్నాయక్, నీలకంఠ ప్రసాద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


