అచ్చంనాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీనియర్ నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా హుందాతనం ప్రదర్శించాలి కానీ ఇలా దిగజారి మరొక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై నోరు పారేసుకోవడం సిగ్గుచేటని తక్షణమే క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వై.యస్.ఆర్.సి.పి యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో నాడు-నేడు ద్వారా స్కూళ్లు బాగుపడ్డాయి, ప్రభుత్వ స్కూళ్లకు సిబియస్ఇ సిలబస్ తీసుకొచ్చారు, మీడియంతో సంబంధం లేకుండా పిల్లలకు సబ్జెక్ట్స్ అర్థం అయ్యేలా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చారు, ఇప్పుడు మీరు గొప్పలు చెప్పుకుంటున్న డీఎస్సీలో కూడా ఆయన మంత్రిగా ఉండగా నోటిఫికేషన్ ఇచ్చిన పది వేల పోస్టులు ఉన్నాయి మీరు దానికి కేవలం ఆరు వేలు పోస్టులు కలిపేసి మెగా డీఎస్సీ అని డప్పు కొట్టుకుంటున్నారు అని సంతోష్ విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థపై ఆయన మార్క్ కనపడుతుంది. మరి అచ్చంనాయుడు ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యవసాయశాఖ పరిస్థితేంటి ఈ రెండేళ్లలో ఒక్కసారైనా రైతులకు విత్తనాలు, యూరియా, ఎరువులు సమయానికి అందించారా అంటూ ఆయన ప్రశ్నించారు. మామిడి, మిరప, పొగాకు, వరి, ఆక్వా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇప్పించారా అంటూ సంతోష్ ప్రశ్నించారు. ఎరువులు దొరకక రోజుల తరబడి రైతులు క్యూ లైన్లో నిలబడే పరిస్థితి, సకాలంలో నీరు కూడా అందించే పరిస్థితి లేదు పంటలు ఎండిపోతూ, రైతు నాశనం అవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాంగా. మరి దద్దమ్మ ఎవరు ప్రజలు కూడా గుర్తిస్తున్నారు అని తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే దమ్ము లేక, మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే సమస్యలపై సమాధానాలు చెప్పలేక, అక్కడ జరుగుతున్న చర్చల ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలిసే ప్రమాదం ఉన్నందున భయంతో డైవర్షన్ కోసం బాబు స్క్రిప్ట్ ను అచ్చన్న అమలుపరుస్తారు అని సంతోష్అన్నారు. ఇకపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని, ప్రజలు అమాయకులు కాదని అన్ని గమనిస్తారు ఎవరు దద్దమ్మలో వారే తెలియజేస్తారు అన్నారు. మా పార్టీ పెద్దన్న బొత్స సత్యనారాయణపై మరొకసారి ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుం ది అని అచ్చంనాయుడును ఆయన హెచ్చరించారు.

అచ్చన్న నోరు అదుపులో పెట్టుకో – బొత్సపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పు శాసనమండలి డైవర్షన్ కోసమే బొత్సపై టార్గెట్ – వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్