శ్రీ కాళహస్తి, జులై 05 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం, అరవకొత్తూరు గ్రామంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు నిల్వ ఉండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల గ్రామంలో దోమలు విపరీతంగా పెరిగిపోయి, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రధాన రాకపోకల మార్గం కావడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు కాలినడకన వెళ్లాలన్నా, వాహనదారులు ప్రయాణించాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డుపై ఉన్న మురుగునీటిని వెంటనే తొలగించి, గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు, శ్రీకాళహస్తి మండల అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తమకు ఈ నరకకూపం నుండి ఉపశమనం కల్పించాలని అరవకొత్తూరు గ్రామ ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

రోడ్డుపైనే మురుగునీరు-వ్యాధుల భయంతో గ్రామస్తుల ఆందోళన