ఖమ్మం, జూలై
పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి ఖమ్మం జిల్లా రిపోర్టర్
డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, UPI యాప్‌లలో వినియోగదారుల పూర్తి మొబైల్ నంబర్‌ను ప్రదర్శించకుండా, కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా బ్యాంకులు, UPI సేవలందించే యాప్‌లు మార్పులు చేయాలని NPCI ఆదేశించింది.
అంతేకాకుండా, భద్రతను మరింత పెంచే లక్ష్యంతో ఫోన్ నంబర్ ఆధారిత గుర్తింపుకు బదులుగా యూజర్‌నేమ్ ఆధారిత UPI ఐడీలను ప్రోత్సహించాలని సూచించింది.
ఈ మార్పులను అమలు చేసేందుకు బ్యాంకులు, UPI యాప్‌లకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, డిజిటల్ లావాదేవీల్లో గోప్యతకు మరింత ప్రాధాన్యం లభించనుంది.



