Friday, 7 August 2026
  • Home  
  • ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్
- తెలంగాణ

ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్

ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్ బోనాల పండుగ నేపథ్యంలో ఆగస్టు 9న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలకు నిషేధం హైదరాబాద్, ఆగస్టు 7: బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 9వ తేదీ (ఎల్లుండి) హైదరాబాద్‌లోని మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని సైబరాబాద్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. వైన్స్ షాపులు, బార్లు, మద్యం విక్రయించే రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేసింది. పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు నిర్వహించే దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సహకరించి పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్

బోనాల పండుగ నేపథ్యంలో ఆగస్టు 9న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలకు నిషేధం

హైదరాబాద్, ఆగస్టు 7: బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 9వ తేదీ (ఎల్లుండి) హైదరాబాద్‌లోని మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని సైబరాబాద్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. వైన్స్ షాపులు, బార్లు, మద్యం విక్రయించే రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేసింది.
పండుగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు నిర్వహించే దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సహకరించి పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు తోడ్పడాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.