దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సమూలంగా మార్చిన యూపీఐ (UPI)కి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐని ఆర్‌బీఐ మార్గదర్శకాలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. ఫోన్ నంబర్లు, క్యూఆర్ కోడ్లు, వివిధ యాప్‌ల ద్వారా క్షణాల్లో నగదు బదిలీ చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో చిల్లర సమస్యలు, నగదు తీసుకెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2016–17లో యూపీఐ లావాదేవీలు 1.78 కోట్లుగా ఉండగా, 2025–26 నాటికి 24,162 కోట్లకు పైగా పెరిగాయి. పదేళ్లలో యూపీఐ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారి, డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికింది.



