Monday, 7 September 2026

Tag: రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా ఏడుగురు నేతలకు షోకాజ్ నోటీసులు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు నేతలకు టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ (DAC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూలై 5న సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతో పాటు, టీపీసీసీ, డీసీసీ నాయకత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వాటిని వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. లచ్చయ్య, ఒరుగంటి నరసింహులు, ఎలుక రాజు, సయ్యద్, గంధ్యాడపు శంకరయ్య, ప్రసాద్ రావు, గంగి స్వామికి నోటీసులు అందాయి. నోటీసులు అందిన 10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని DAC ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే పార్టీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ ఆదరణ చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 ( పున్నమి ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిరిసిల్ల జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య భాస్కర్ రాథోడ్ నాయక్ అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఇంద్రచౌక్‌లో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న భాస్కర్ రాథోడ్ నాయక్ ప్రజల పక్షాన గళమెత్తారు. ప్రజల కోసం.. ప్రజలతో కలిసి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై BRS పార్టీ నల్ల బ్యాడ్జిల నిరసన

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి) ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి–వెంకట్రావుపల్లె గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పల్లెప్రగతి పడకేయడం, తాగునీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు, వీధిదీపాల సమస్యలు, నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ ఎండ్ర చందన్, సర్పంచ్ రడం లక్ష్మి, ఉపసర్పంచ్ ఓర్పుల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సీనియర్, యువజన నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.