Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు దీక్షకు భారీ గా బిజెపి కార్యకర్తల వాహనాల తరలింపు

జనగామ,ఆగష్టు 25,పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు రెండు రోజుల దీక్షకి జనగామ జిల్లా సౌడ రమేష్ ఆధ్వర్యంలో జెండా ఊపి వాహనాలు జనగామ రైల్వే స్టేషన్ నుండి జిల్లాలోని పలు మండలాలనుండి 50 వాహనాలలో బిజెపి నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు వివిధ మోర్చా నాయకులు తరలి వెళ్లడం జరిగింది జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ 40 లక్షల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని కోటి మంది విద్యార్థి తల్లిదండ్రుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా చూడాలని లేనియెడల బిజెపి పార్టీ తరఫున ఉద్యమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ బల్ల శ్రీనివాస్ బొజ్జపల్లి సుభాష్ పల్లె కుమార్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకటరెడ్డి పెద్దోజు జగదీష్ రాజు గోధుమల అశోక్ దూసరి శివకృష్ణ బాలకిషన్ ప్రశాంత్

జనగాం

విద్యార్థులకు భోజన ప్లేట్ లు వితరణ

జనగామ, పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ మండలం గానుగుపహాడ్ హరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ ఇంటర్నేషనల్ అబాద్ జనగాం అధ్యక్షులు వనమాల సోమయ్య ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల కృష్ణ ప్లేట్స్ మరియు వాటర్ బాటిల్స్, వాటర్ డ్రం, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను గ్రామ సర్పంచ్ శ్రీమతి సానబోయిన అనూష మహిపాల్ , ఉప సర్పంచ్ కొర్ర శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సానబోయిన అనూష మాట్లాడుతూ సమాజం మనకు ఎంతో ఇచ్చింది ఆ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సత్సంకల్పంతో లయన్స్ ప్రతినిధులు చేస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాచగోని బుచ్చమ్మ లయన్స్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు నాగబండి రవీందర్ అల్లాడి ప్రభాకర్ మరియు పాఠశాల ఉపాధ్యాయిని సుకన్య పాల్గొనడం జరిగింది.

జనగాం

కవితా సమ్మేళనం విజయవంతం :ఫర్టైల్ బ్రెయిన్స్ ప్రధాన నిర్వాహకులు ప్రసన్న కుమార్

కవుల సమ్మేళనం విజవంతం ________________________ జనగామ,ఆగష్టు 25,పున్నమి జిల్లా ప్రతినిధి :ఆదివారం రోజున హైదరాబాద్ లో నిర్వహించిన కవుల సమ్మేళనం విజవంతంగా నిర్వహించడం జరిగింది అని నిర్వాహకులు కె. ప్రసన్న కుమార్ తెలిపారు.సకాలంలో వర్షపాతం వ్యవసాయం కోసం అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది, సమృద్ధిగా ఉండే పంటలు మరియు పశువుల ఉత్పాదకతను పెంచుతుంది. ‘ఆదివారం, ఆగష్టు 2026, నాగరం, హైదరాబాద్ లో కవితా ప్రతిధ్వని యొక్క విభాగంలో బహుభాషా కాంపాక్ట్ కవిత్ర కూర్పును నిర్వహించింది.”విభిన్న అంశాలు” పై కవితా ఆలాపన చేశారు.వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కవులు డాక్టర్ నరసింహ రెడ్డి, విజయ్, జయశంకర్ ప్రసాద్,బంగారు,ఆచార్యులు ఫానేంద్ర, డాక్టర్ బ్రహ్మానంద్రా, నాశలా అనంద్యాచరీ, పౌచ్చయా , డాక్టర్ రూపలి సిర్కార్ గౌర్ మరియు ఇతరులు సున్నితమైన కవితా ప్రవాహం ద్వారా వారి వ్యక్తీకరణను వ్యక్తం చేసారు.ఈ సమావేశం లో పాల్గొన్న వారికి డాక్టర్ రాధా శ్రీ ద్వారా శాలులు మరియు పుస్తకాలతో సన్మానం చేయడం జరిగింది.ఈ కవిత సమ్మేళనం లో ప్రత్యేక ప్రస్తావన డాక్టర్ రాధాశ్రీ జికి దక్కుతుంది , అతను ముందుకు వచ్చి, సమ్మేళనం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం వ్యక్తం చేశారు.కవిత్వ పఠనం విభిన్న అంశాలు పై పరిసరాలు, పర్యావరణ, పారిశుధ్యం, ప్రకృతి,యుద్ధాలపై దృశ్యమాన సంభాషణలు మాత్రమే కాకుండా, సరిహద్దుల గురించి సంబంధించిన విషయాలు, తేడాలు, గొప్ప హాస్యం కూడా కలిగి ఉన్నాయి , చిన్న స్కిట్లతో పాటు, పాటలు పాడటం జరిగింది.

జనగాం

నడత నేర్పిన అమ్మను మరువకు

నడత నేర్పిన అమ్మను మరువకు —————————————— నడత నేర్పిన అమ్మను మరువకు నడక నేర్పిన నాన్నను మరువకు మంచి ప్రవర్తన తో మెలిగినచో మంచి ఫలితాలు వస్తాయి చెడు ప్రవర్తనతో మెలిగినచో దుష్ట ఫలితాలు వస్తాయి… కష్టాలెన్ని ఎదురైనా చేపలాగా ఎదురీదాలి లక్ష్య సాధనకై కృషి చేయాలి తల్లి దండ్రుల ఆశయాలను కడవరకు నెరవేర్చాలి….. నడత నడకలు సక్కగా ఉంటే జీవితం మంతా సఫలమే వంకరటింకార వెళ్లినట్లయితే దారం తెగిన గాలిపటం లాగా చినిగిన ఇస్తారాకుల లాగా చెల్లచెదారమవుతుంది జీవితమంతా… జీవితం నీటి బుడుగ లాంటిది శాశ్వతం ఏది లేదు ఈ లోకంలో సాటి మనిషికి సాయం చేయాలి మానవ సేవయే మాధవ సేవగా పది మందికి సహాయం చేయాలి సత్సంబంధాలు పెంచు కోవాలి… —రేణుకుంట్ల మురళి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కలం పేరు :బిస్మరేయ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ పోయెట్,రైటర్ &ఆథర్

జనగాం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్ర రావు దీక్ష ను విజవంతం చేయాలి

జనగామ, ఆగష్టు 24,పున్నమి ప్రతినిధి : ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం సర్ కమిటీ జిల్లా కన్వీనర్ బొజ్జపల్లి సుభాష్ అధ్యక్షత వహించగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగాసౌడ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక చదువుకు దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉందని విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు మనోవేదనకు గురి అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రా రావు హైదరాబాదులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజులపాటు దీక్ష చేస్తున్న రేపు జనగామ జిల్లా భాజాపా కార్యకర్తలు ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో నాంపల్లి లోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని రామచంద్ర రావు దీక్షను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే భాజపా ఆధ్వర్యంలో జిల్లాలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు విడుదల రమేష్ బల్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి పెరుమళ్ళ అమరేందర్ రెడ్డిదుర్గాప్రసాద్ వివిధ మండలాల అధ్యక్షులు సట్ల వెంకటరమణ బైరుపాక కుమార్ పుప్పాల వేణు గంటే ఉపేందర్ జగదీష్ సందీప్ వివిధ మోర్చాల అధ్యక్షులు బిజెపి నాయకులకు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జనగాం

తీన్మార్ మల్లన్న పాదయాత్ర కు ప్రతి కార్యకర్త సైనుకుడిలా సిద్ధం కావాలి

సెప్టెంబర్ 17 తేదీన పాదయాత్రకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధం కావాలి –కట్ల సదానందం టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు ——————————- జనగామ, ఆగష్టు 23,పున్నమి జిల్లా ప్రతినిధి :జిల్లా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి పార్టీ బలోపేతమే లక్ష్యం మల్లన్న పాదయాత్ర విజయమే మన సంకల్పంi ప్రతి కార్యకర్త అడుగు ముందుకు – ప్రతి గ్రామంలో సభ్యత్వం మరియు పార్టీ బలోపితం. మహిళల చేరికలు… పదవుల అప్పగింత మండల కమిటీలు గ్రామ కమిటీలు నిర్మాణాత్మకంగా పనిచేయాలి అని కోరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ డా. కల్నల్ మాచర్ల బిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. కల్నల్ మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న MLC తీన్మార్ మల్లన్న ప్రారంభించనున్న పాదయాత్రకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండలాలు, గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గడపకు పార్టీ సభ్యత్వాన్ని తీసుకెళ్లాలని సూచించారు. మహిళలకు బాధ్యతలు – పార్టీకి కొత్త బలం* జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి ఆధ్వర్యంలో పలువురు మహిళలకు పార్టీ కండువాలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీలో చేరిన వారు చింతల కోమలత మహిళా పట్టణ అధ్యక్షురాలిగా, కొలిపాక మమత బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాలు అందజేశారు. అలాగే మంద సరిత జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో మహిళలు ముందుండాలి. రాబోయే ఎన్నికల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు రాజకీయంగా ఎదగాలి. ఇంటి పనులకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి” అని అన్నారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళా నాయకులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట్ల మురళి బైండ్ల,జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీసా శ్రీధర్ గౌడ్, ఇల్లందుల రవీందర్, జిల్లా కార్యదర్శి మంద దిలీప్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యమంకి విజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, యూత్ సంయుక్త కార్యదర్శి సల్మాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

జనగాం

ప్రణయ్ తేజ మరణం వెనుక ఉన్న మానసిక శాస్త్రం ఏమిటో తెలుసు కుందాం

ప్రణయ్ తేజ మరణం వేనుక ఉన్న మానసిక శాస్త్రం ఏమి..? తరగతి గదిలో కోపం, భయం, విచక్షణ కోల్పోవడం మనకు నేర్పుతున్న అత్యంత బాధాకరమైన పాఠం “ఒక చిన్నోడు చనిపోయిండు… కానీ అసలు చనిపోయింది ఒక్క ప్రాణమేనా? లేక మన విద్యా వ్యవస్థలోని ఒక ముఖ్యమైన విలువ కూడా చనిపోయిందా?” విశాఖపట్నంలో చిన్నోడు పాఠశాల తరగతి గదిలో కుప్పకూలి మరణించిన ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. మీడియా కథనాల ప్రకారం, హోంవర్క్‌కు సంబంధించిన విషయంపై ఉపాధ్యాయురాలు చిన్నారిని మందలించడం, కొట్టడం జరిగిన తర్వాత బాలుడు కుప్పకూలాడు. అయితే ఈ సంఘటన మన ముందు ఒక అత్యంత ముఖ్యమైన ప్రశ్నను నిలబెడుతోంది: “ఒక ఉపాధ్యాయుడు ఎందుకు ఒక విద్యార్థి పై అంతటి కోపాన్ని ప్రదర్శించే స్థితికి చేరుకుంటాడు?” మరొక ప్రశ్న: “అంత చిన్న వయసులో ఉన్న ఒక బాలుడి యొక్క మానసిక, శారీరక అభివృద్ధి స్థితిని మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా?” ఇదే విషయాన్ని సైకాలజీ కోణంలో లోతుగా పరిశీలించి చూడాలి, 1. LKG పిల్లవాడు “అల్లరి చేస్తున్నాడా?” లేక అల్లరి అతని వయస్సు సహజ లక్షణాలనే మనం అల్లరిగా చూస్తున్నామా? LKG వయస్సు పిల్లలలో Executive Functions, Impulse Control, Emotional Regulation, Sustained Attention వంటి సామర్థ్యాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది ● పక్క పిల్లవాడితో మాట్లాడవచ్చు ● గొడవపడవచ్చు ● గిచ్చుకోవచ్చు ● ఏడవవచ్చు ● నవ్వవచ్చు ● ఒక్కసారిగా ఒక పని నుంచి మరో పనికి మారవచ్చు ● టీచర్ చెప్పిన మాటను వెంటనే పాటించకపోవచ్చు ● తన భావోద్వేగాన్ని పెద్దవాడిలా నియంత్రించలేకపోవచ్చు. ఇది ప్రతి పిల్లవాడిలో ఒకే విధంగా ఉండదు. కానీ ఈ వయస్సులో Self-regulation ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రక్రియ. అందుకే LKG పిల్లవాడి ప్రవర్తనను పెద్దవారి ప్రమాణాలతో కొలవడం ప్రమాదకరం. పిల్లవాడికి “నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?” అని అడగడం కంటే, ఒక టీచర్ అతని వయస్సును అర్ధం చేసుకోవడం ముక్యం ఇదే Developmental Psychology మనకు నేర్పే మొదటి పాఠం. 2. పిల్లవాడు Present-focused గా ఎందుకు కనిపిస్తాడు? చిన్న పిల్లలలో భవిష్యత్ పరిణామాలను పెద్దవారిలా అంచనా వేసే సామర్థ్యం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. “నేను ఇప్పుడు ఇలా చేస్తే తర్వాత ఏమవుతుంది?” అనే consequence evaluation సామర్థ్యం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే పిల్లవాడు ఆ క్షణంలో ఉన్న భావోద్వేగానికి ఎక్కువగా స్పందించవచ్చు. ● అతను నవ్వితే పూర్తిగా నవ్వుతాడు. ● ఏడిస్తే పూర్తిగా ఏడుస్తాడు. ● భయపడితే పూర్తిగా భయపడతాడు. ● ఆడితే పూర్తిగా ఆటలో మునిగిపోతాడు. అందుకే చిన్నపిల్లల ప్రవర్తనను కేవలం “అల్లరి” అనే ఒక పదంతో నిర్వచించడం సరైంది కాదు. వారి ప్రవర్తన వెనుక ఉన్న Developmental Stage ను అర్థం చేసుకోవాలి. 3. అదే తరగతి గదిలో టీచర్ యొక్క Expectation ఏమిటి? టీచర్ క్లాస్‌లోకి వచ్చినప్పుడు సహజంగానే కొన్ని అంచనాలు ఉంటాయి: ● అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ● నేను చెప్పింది వినాలి. ● హోంవర్క్ చేయాలి. ● ఎవరూ గొడవపడకూడదు. ● పిల్లలు క్రమశిక్షణ పాటించాలి. ఇవి తప్పు అంచనాలు కావు. కానీ సమస్య ఎక్కడ మొదలవుతుంది? Teacher Expectation మరియు Child Development మధ్య తేడాను టీచర్ అర్థం చేసుకోనప్పుడు. ప్రతి క్లాస్‌లో Active children ఉంటారు. కొంతమంది Quiet children ఉంటారు. కొంతమంది Highly active children ఉంటారు. ఒక పిల్లవాడి Active Behaviour ను “చెడ్డ పిల్లవాడు” అనే Label గా మార్చినప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది. 4. “ఈ పిల్లవాడు ఎప్పుడూ ఇలాగే ఉంటాడు” — ఇదే ప్రమాదకరమైన Psychological Label ఒక పిల్లవాడు ఒకసారి అల్లరి చేశాడు. రెండోసారి కూడా అల్లరి చేశాడు. మూడోసారి కూడా చేశాడు. అప్పుడు టీచర్ మనసులో ఒక Negative Behaviour Label ఏర్పడవచ్చు: ఎందుకంటే టీచర్ నిజాని అర్ధం చేసుకోవడం లో విఫలమైనది ● ఇతను అల్లరి పిల్లవాడు. ● ఇతను ఎప్పుడూ వినడు. ● ఇతను చాలా తుంటరి. ఆ తర్వాత ఒక ఆసక్తికరమైన మానసిక ప్రక్రియ మొదలవుతుంది. ఆ పిల్లవాడు ఏం చేసినా అదే Label ద్వారా చూడటం ప్రారంభమవుతుంది. దీనిని విస్తృతంగా Cognitive Bias / Labelling Effect వంటి మానసిక ప్రక్రియలతో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు పిల్లవాడు ఒక వ్యక్తిగా కనిపించడు. అతని Behaviour మాత్రమే కనిపిస్తుంది. అక్కడినుంచి Teacher–Child Relationship లో Negative Interaction Cycle ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5. మరి టీచర్ ఎందుకు అంత కోపానికి వెళ్తారు? ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా చెప్పాలి. Psychology మనకు ఒక సాధారణ సత్యాన్ని చెబుతుంది: ఒక వ్యక్తి ఇప్పటికే Stress, Fatigue, Frustration, Emotional Overload లో ఉన్నప్పుడు, చిన్న Trigger కూడా తీవ్రమైన Emotional Reaction కు దారితీయవచ్చు. దీనిని Emotional Dysregulation అనే భావనతో అర్థం చేసుకోవచ్చు. అంటే—భావోద్వేగం రావడం సమస్య కాదు. భావోద్వేగం వచ్చినప్పుడు దాన్ని అర్ధం చేసుకోలేక , వికక్షణ కోల్పోయి కోపాని నియంత్రించలేక పోవడం వల్ల వచ్చే సమస్య. ముందుగా అర్ధం చేసుకోలేక పోవడం, దానికి సంబందించిన జ్ఞానం లేకపోవడం 6. Anger → Arousal → Cognitive Narrowing → Impulsive Action తీవ్రమైన కోపంలో మన శరీరం High Arousal State లోకి వెళ్తుంది. హృదయ స్పందన పెరగవచ్చు. శ్వాసలో మార్పులు రావచ్చు. శరీరం Alert state లోకి వెళ్లవచ్చు. అదే సమయంలో మన ఆలోచనలో Cognitive Narrowing ఏర్పడవచ్చు. అంటే మన ముందు ఉన్న సమస్య మాత్రమే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. “పిల్లవాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు?” అనే ప్రశ్న కంటే, “ఇతను నా మాట ఎందుకు వినడం లేదు?” అనే ఆలోచన ముందుకు రావచ్చు. ఇక్కడ Impulse Control తగ్గితే— ఆలోచన → కోపం → శారీరక చర్య అనే ప్రమాదకరమైన మార్పు చాలా వేగంగా జరగవచ్చు. అందుకే స్కూల్ లోని ప్రతి టీచర్లకు Subject Knowledge మాత్రమే కాకుండా Emotional Self-Regulation Skills కూడా తప్పకుండా అవసరం. 7. పిల్లవాడి భయం — ఇది కేవలం ఏడుపు కాదు పిల్లవాడి body language ను చూస్తే, అతను తీవ్రమైన భయాందోళనలో ఉన్నట్లు మనకు స్వస్టంగా మనకు కనిపిస్తుంది ● చేతులతో వెనక్కి తగ్గడం, ● నేను ప్రమాదం లో ఉన్నానని తెలుసుకొవడం ● ఏడవడం, ● రక్షణ కోరే gestures చేయడం, ● పెద్దవారి నుండి దూరంగా ఉండాలని ప్రయత్నించడం— ఇవి Fear Response కు సంబంధించిన behavioural signs ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారి యొక్క nervous system తీవ్రమైన arousal లోకి వెళ్లవచ్చు. ఇక్కడ Fight, Flight, Freeze వంటి stress responses గురించి మనం మాట్లాడాలి. చిన్న పిల్లవాడు “నేను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాను” అనే భావనకు లోనైతే, అతని శరీరం మరియు మనస్సు పెద్దవారి మాదిరిగా పరిస్థితిని విశ్లేషించి స్పందించదు. అతనికి ఆ క్షణం మొత్తం ప్రపంచమే ప్రమాదంగా అనిపించవచ్చు. 8. చిన్నోడు చనిపోవడానికి ముందు తనలో ఏమి జరిగినది ..? ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్పాలి: “ఏడుపు వల్ల ఊపిరితిత్తులు పనిచేయక చనిపోయాడు” లేదా “భయం వల్లే మరణించాడు”. ఇది నిజమని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఆ చిన్నోడు టీచర్ బలవంతంగా అరుస్తూ పిలవడంతో తను ఏడుస్తూ దగ్గరికి వచ్చాడు అయినప్పటికీ టీచరు తన కోపంతో ఊగిపోతున్న అనే సృహ లేకుండా అబ్బాయిని కాలర్ పట్టి దగ్గరికి లాగి షర్ట్ బటన్స్ అన్నీ ఓపెన్ చేస్తూ లాగు పట్టి లాగడం ఇవన్నీ కూడా అతన్ని మరింత లోతుగా భయానికి గురి చేస్తూ గుక్క పట్టి ఏడ్చేలా చేసింది. ఆ గుక్క పట్టి ఏడ్చే క్రమంలో తనకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆ విసయం లో అవగాహన ఉంది . పెద్ద వాలకే ఇబ్బంది కలుగుతుంది . అలాగే మేడం తిడుతున్నప్పటికీ ఆ బాధనంతా దిగమింగుతూ కంట్రోల్ చేసుకుంటూ ఉండటం వల్ల శరీరంలో ఉన్నటువంటి బ్రైన్ ,ఊపిరితిత్తుల వంటి అవయవాలా పైన ఎఫెక్ట్ పడి బ్రెయిన్ స్ట్రోక్ గాని హార్ట్ ఎటాక్ గాని 100% రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ చిన్నోడి పరిస్థితిని గమనిస్తే ఇదే జరిగిందని మనకు అర్థమవుతుంది. 9. అసలు ప్రశ్న: “చెంపదెబ్బ”నా? “Emotionally dysregulated behaviour”నా? ఈ సంఘటనను కేవలం: “టీచర్ ఒక చెంపదెబ్బ కొట్టింది → పిల్లవాడు చనిపోయాడు” అనే ఒకే రేఖలో చూడటం సరిపోదు. మనకు కనిపించేది ఒక Behavioural Chain: ● Child Behaviour ● ↓ Teacher Expectation ● ↓ Repeated Frustration ● ↓ Anger / Emotional Arousal ● ↓ Cognitive Narrowing ● ↓ Loss of Inhibitory Control ● ↓ Physical Aggression ● ↓ Child Fear / Distress ● ↓ Medical Emergency / Collapse ● ↓ Tragic Outcome ఇది ఒక Psychological–Behavioural Chain గా పరిశీలించాల్సిన అంశం. అయితే చివరి వైద్య కారణాన్ని మాత్రం వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలే నిర్ధారించాలి. 10. ఒక టీచర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమి కోల్పోతాడు? ఒక సెకను. ఒక క్షణం. ఒక impulsive action. కానీ దాని ఫలితం జీవితాంతం వెంటాడవచ్చు. ● ఒక పిల్లవాడి జీవితం. ● ఒక తల్లి కడుపుకోత. ● ఒక తండ్రి జీవితాంతపు బాధ. ● ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు. ● ఒక టీచర్ యొక్క వృత్తి.

జనగాం

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

ఘనంగా జనగామ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ————————————————————- జనగామ, ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి : ఈరోజు స్థానిక మినీ స్టేడియం జనగామలో జనగామ జిల్లా స్థాయి 14, 16, 18 మరియు 20 సంవత్సరాల బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు జరిగినవి, ఈ ఎంపికలలో జిల్లా నలుమూల నుండి దాదాపు 700 మంది క్రీడాకారులు ఈ ఎంపికలలో పాల్గొన్నారు, ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 మరియు 27 తేదీలలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెద్ది వెంకటనారాయణ గౌడ్ గారు తెలియజేశారు, గతంలో సెలక్షన్స్ జరిగినప్పుడు రెండు మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనేవారు అది ఈరోజు దాదాపు 600 నుండి 700 మంది క్రీడాకారులు పాల్గొనడం ఒక గొప్ప విషయమని తెలియజేసి ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు, ఈ ఎంపికల్లో జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి శ్రీ ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి శ్రీ వంచా చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు రంజిత్ రవీంద్ర ప్రసాద్ సుధారాణి దిలీప్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు -2026,దరఖాస్థుల ఆహ్వానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 – దరఖాస్తుల ఆహ్వానం ——————————————————— జనగామ, ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నూతన బోధనా పద్ధతుల వినియోగం, పాఠశాల అభివృద్ధి మరియు సమాజంలో విద్య పట్ల అవగాహన పెంపొందించడంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి, ప్రోత్సహించుటలో భాగంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 కొరకు అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 కొరకు అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. *దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన వివరాలు:* 1.ప్రాథమిక పాఠశాల (PS) మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS) ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి (MEO) ధృవీకరణతో సమర్పించవలెను. 2. ఉన్నత పాఠశాల (HS) ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుల (Headmaster) ధృవీకరణతో సమర్పించవలెను. 3.ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో, సంబంధిత ధృవపత్రాలతో సహా సమర్పించవలెను. 4.ధృవీకరించిన దరఖాస్తులను 25.08.2026 సాయంత్రం 4.00 గంటలలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని గది నం. F-27, జనగామలో సమర్పించవలెను. 5.నిర్దేశిత గడువు అనంతరం అందిన దరఖాస్తులను స్వీకరించబడవు. అర్హత ప్రమాణాలు మరియు ఎంపిక విధానం సంబంధిత ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు నిబంధనల ప్రకారం అమలు చేయబడును

జనగాం

ఎల్నినో ప్రభావం.. పంటలపై అప్రమత్తం :తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి. రమ్య

ఎల్నినో ప్రభావం …. పంటల పై అప్రమత్తం —————————————————— జనగామ,ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై ఆగష్టు మాసాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. జనగామ జిల్లా లో ఇప్పటివరకు 247 .4 మీ. మీ. వర్షం కురవగా ఇది సాధారణ వర్షపాతం కన్నా 43.2 శాతం తక్కువగా నమోదయింది. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలలో తేమ సంరక్షణ, సమతుల్య పోషక యాజమాన్యం, కలుపు మరియు చీడపీడల సకాలంలో నివారణ చర్యలు చేపట్టి, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం–జనగామ కోఆర్డినేటర్ డా. వి. రమ్య సూచించారు. వరి లో ఎక్కడైతే నార్లు పోయలేదో ఆగష్టు మాసంలో వెదజల్లే లేదా డ్రంసీడర్ పద్ధతి లో విధ్హుకోవడం మంచిది. వారి నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యమయ్యే కొద్దీ రకాలను బట్టి దిగుబడి తగ్గడమే కాకుండా చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ముదురు నారు నాటాల్సి పరిస్థితులలో మొక్కల మధ్య దూరం తగ్గించుకొని దగ్గర దగ్గరగా నాట్లు వేసుకుంటే దిగుబడి పై ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రధాన పొలం లో కలుపు మొక్కల నివారణకు ఎకరానికి 4 కిలోల బెన్సుల్ఫ్యూరం బెన్సుల్ఫ్యూరాన్ మిథైల్ 0.6 % జి ఆర్ + ప్రేతిలాక్లోర్ + సైఫనర్ మందును 600- 800 మీ. లీ నాటిన 3-5 రోజులలోపు పిచికారీ చేయాలి. వర్షాధారం మీద ఆధారపడి మొక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే నీటి కొరత వలన ఆకులు ముడుచుకొని సన్నగా అవడం, మొక్క ఎదుగుదల తగ్గిపోవడం వంటివి గమనించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు సరైన సమయం లో నీరు పెట్టుకోవాలి లేదా నీటి ఎద్దడి ఉంటే యూరియా 2 % ద్రావణాన్ని పంటపై పిచికారీ చేస్తే బెట్ట పరిస్థితిని కొంతవరకు తట్టుకోవచ్చు. వర్షాభావ పరిస్థితుల అనంతరం వచ్చిన వర్షాలకు ఎకరా కు 25 కిలోల యూరియా ని అదంగంగా వేసుకుంటే దిగుబడి పెంచవచ్చు. కత్తెర పురుగు నివారణకు 10- 12 రోజుల పీరు పై వేప సంబంధిత మందు అజాధిరాక్టిన్ (1500 పిపియం) 5 మీ. లీ లేదా ఇమామెకిటిన్ బెంజోయట్ 0.4 గ్రా. లేదా క్లొరాన్ట్రేనీలిప్రోల్ 0.4 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సాధ్యమయినంత వరకు మందు ద్రావణం మొక్కసుడిలో పడేలాగా పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు, కత్తెర పురుగును గమనించిన వెంటనే పొడి ఇసుకను, సున్నంను (9 పాళ్ళు ఇసుక + 1 పాళ్ళు సున్నం) కలిపి మొక్కజొన్న సుడులలో వేసుకొన్నచో ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి. పంటలో అంతర కృషి జరిపి ఎకరాకు 50 కిలో ల యూరియా ను పై పాటుగా వేసుకొని మట్టిని మొక్కల వేర్లకు ఎదగదోయవలెను. కంది పంట ప్రస్తుతం 20 నుండి 40 రోజుల దశలో ఉంది. తొలి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అంతరకృషి చేసి కలుపును నివారించి భూమిని గుల్లబారేలా తాయారు చేసినచో భూమిలో తేమ బాగా నిలిచి బెట్టాను కొంతవరకు తట్టుకోగలదు. అంతరకృషి సాధ్యం కానీ పరిస్థితులలో కలుపు నివారణకు విత్తింక 20 రోజులకు ఇమాజితపైర్ 300 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినచో గడ్డి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు. బెట్ట పరిస్థితులలో రసంపీల్చే పురుగులు ముఖ్యనగ పేనుబంక ఆశించి మొక్కలు రాలిపోతాయి. Kaavuna 20 గ్రా. యూరియా ద్రావణం లేదా 10 గ్రా. మల్టీ-కే లేదా పాలీఫీడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను. పెసర, మినుములో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు తేమను కాపాడుకోడానికి కలుపు మొక్కల నివారణకు అంతర కృషి చేసుకోవాలి. మొగ్గ పూత దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినచో 0.5 % పొటాషియం నైట్రేట్ (5 గ్రా. లీటరు నీటికి) లేదా 0.5 % 19 :19 :19 (5 గ్రా. లీటరు నీటికి) ఆకుల పై పిచికారీ చేయాలి. ఆకు ముడుత వైరస్ ను వ్యాపింపచేసే తామర పురుగుల నివారణకు అసిఫాట్ 1గ్రా లేదా ఫిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు ఒక లీటరు నీటికి 0 .2 గ్రా. అసిటామిప్రిడ్ లేదా 1 .25 గ్రా. డైఫెన్తయురాన్ కలిపి పిచికారీ చేయాలి. పూతలో మారుకా ఆకు ముడుత పురుగు నివారణకు నోవాల్యూరాన్ 1 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0 .2 మి.లీ. మందును పిచికారీ చేసుకోవచ్చు. అవసరమయితే వారం రోజుల తరువాత మరల పిచికారీ చేయాలి. ఈ విధంగా రైతులంతా అప్రమత్తంగా ఉండి శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖా సూచనల మేరకు సమర్థవంతమయిన యాజమాన్య పద్ధతులతో ముందస్తు జాగ్రత్తలు చేపడితే పంటల నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవాకాశం ఉందని డా. వి. రమ్య తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.