Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్ర రావు దీక్ష ను విజవంతం చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

జనగామ, ఆగష్టు 24,పున్నమి ప్రతినిధి :
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం సర్ కమిటీ జిల్లా కన్వీనర్ బొజ్జపల్లి సుభాష్ అధ్యక్షత వహించగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగాసౌడ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక చదువుకు దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉందని విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు మనోవేదనకు గురి అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రా రావు హైదరాబాదులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజులపాటు దీక్ష చేస్తున్న రేపు జనగామ జిల్లా భాజాపా కార్యకర్తలు ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో నాంపల్లి లోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని రామచంద్ర రావు దీక్షను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే భాజపా ఆధ్వర్యంలో జిల్లాలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు విడుదల రమేష్ బల్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి పెరుమళ్ళ అమరేందర్ రెడ్డిదుర్గాప్రసాద్ వివిధ మండలాల అధ్యక్షులు సట్ల వెంకటరమణ బైరుపాక కుమార్ పుప్పాల వేణు గంటే ఉపేందర్ జగదీష్ సందీప్ వివిధ మోర్చాల అధ్యక్షులు బిజెపి నాయకులకు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్ర రావు దీక్ష ను విజవంతం చేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *