Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: జనగామ

జనగాం

బిజెపి మైనారిటీ సంక్షేమం కోసం కట్టుబడి ఉంది :బిజెపి మైనారిటీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ జగన్మోహన్ సింగ్

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం మైనార్టీ మూర్చ జిల్లా అధ్యక్షులు వలి పాషా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైనార్టీ మూర్చ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ జగ్మోహన్ సింగ్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ బిజెపి మైనార్టీ సంక్షేమం కోసం కట్టుబడి ఉందని త్రిబుల్ తలాక్ రద్దు చేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ అని గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించినది గుర్తు చేశారు తెలంగాణలో జైనులు సిగ్గు ముస్లిమ్స్ క్రిస్టియన్ పార్శి తదితర మైనార్టీ వర్గాల్లో అవగాహన కల్పించి బిజెపి బలోపేతానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు బిజెపి రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్జి,జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి, జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ నీష్ జైన్ గారు హరి ప్రీత్ సింగ్ రాష్ట్ర కార్యదర్శులు సత్పాల్ సింగ్ షాజహాసన్ సతీష్ కుండ్యా గిజిని జిపి జైపాల్ ప్రదీప్ సురభి పెద్దోజు జగదీష్ గంధం రాములు శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

జనగాం

బిసి ఐక్య చైతన్య సమితి జిల్లా అధ్యక్షులు గా బోడ రమేష్ నేత

1996 సంవత్సరములు రాజకీయ ప్రస్థానం కమ్యూనిస్టు జండా విధానాలు వచ్చి ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అవినీతి రాజకీయాల పైన పోరాటం చేస్తూ,సందర్భంలో 2001 ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి కేసిఆర్ గారి సమక్షంలో ఆలేరులో టిఆర్ఎస్ పార్టీలో చేరి నాటి నుండి ఉద్యమ సందర్బం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం బీడీ కార్మికులు పవర్లను కార్మికులు చేనేత కార్మి కులు పడుతున్న కష్టాలని గమనించి 2009లో చిన్నత సొసైటీల అధిపతి అహంకారాలకు కొత్త సభ్యత్వాల కొరకు ఉద్యమాలు చేయడం జరిగింది.ఇలాంటి సందర్భంగా రాజకీయ పార్టీల తోడు ఉంటూనే ఒకరి చేతి కింద మోచేతి నీళ్లు తాగకుండా సొంత కుంపటిగా ఏర్పడి చక్రం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి 2009లో ఉద్యమాలు మొదలుపెట్టి ఆలేరు గడ్డ పైన బడుగు బలహీన వర్గాల అభినయతకై పోరాటం చేసి రాజకీయ పార్టీలకు దీటుగా జెండాను అజెండాని ప్రకటించి రాష్ట్రస్థాయిలో 1600 సభ్యత్వాలను కూడా కట్టి ఆనాటి ఉమ్మడి జిల్లాలు నాలుగు జిల్లాల స్థాయిలో స్వచ్ఛమైన సంస్థ రాజకీయాలను మొదలుపెట్టి ఆనాటి తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ సంఘము నుండే తెలంగాణ ఉద్యమానికి జైలు జీవితం అనుభవించడం జరిగింది 2001 ఒకటి నుండి 2013 సర్పంచ్ ఎన్నికల్లో 8 వ వార్డు టికెట్ ని టిఆర్ఎస్ నుండి ఆశించి బంగపడి రాజకీయాలకు దూరంగా ఉన్న సందర్భంలో ఆనాటి 2004 ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి సర్పంచిని గెలిపించడం జరిగింది దాని తర్వాత వరంగల్ జిల్లా జనగాం వలస రావడం జరిగింది. కొద్ది రోజులు రాజకీయాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున కొనసాగిస్తూ సందర్భంలో 2023 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 జాగాను 25 వేల పింఛను కుటుంబ అందరికీ హెల్త్ కార్డులు ప్రవేశిస్తానని చెప్పడం సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అనాది కాలంలోనే చేనేత కార్మికులకు నష్టం జరుగుతుందని 07/08/2025 రోజున కలెక్టర్ ఏడి అదేవిధంగా డైరెక్టర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీని దూషించడం జరిగింది. చేనేత కార్మికులు నష్టపోతున్నారని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి రాజనామ చేసి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేను ఈనాడు 17/10/2025 రోజున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీలోకి తెలంగాణ రాజ్య అధికార పార్టీలోకి చేరడం జరిగింది,చేరిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగాం జిల్లా నియోజకవర్గ యూత్ ఇన్చార్జిగా ప్రకటించారు.పార్టీ విధానాల పైన పార్టీలో ఉన్న కొన్ని శక్తుల పైన నచ్చక ఆ పదవికి రాజనామా చేయడం జరిగింది అందువలన మల్లన్న గారి దృష్టికి వెళ్లిన వెంటనే జనగాం జిల్లా టిఆర్పి ఉపాధ్యక్షులుగా ప్రకటించారు కొనసాగుతా ఉన్న నేను 2024 నాలుగులో తెలంగాణ ఉద్యమకారుల పోరం నాయకత్వం నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది జనగాం జిల్లా TUF సంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేసిన అనుభవం తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన ఆకారపు మోహన్ ఆలోచన మేరకు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకారం మోహన్ సూచన మేరకు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శిలు ఆదిలాబాద్ జనగాం జిల్లాల ఇన్చార్జిలు కొన్ని సిద్దయ్య సమక్షంలో బీసీ ఐక్య చైతన్య సమితి జనగాం జిల్లా అధ్యక్షునిగా బోడ రమేష్ నేత జిల్లా అధ్యక్షునిగా ప్రకటించారని తెలిపారు .ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మోహన్, రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య లకు కృతజ్ఞతలు తెలియచేశారు.

జనగాం

ప్రభుత్వ విద్యారంగాన్ని బ్సలోపేతం చేద్దాం -, జీవో నెంబర్ 25 ను సవరించి తరగతికొక ఊపాయద్యుడిని ఇవ్వాలి :tsutf

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం జీవో నెంబర్ 25న సవరించి తరగతికొక ఉపాధ్యాయుడిని ఇవ్వాలి —TSUTF జనగామ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు డిమాండ్ ———————————————————————- జీవో నెంబర్ 25ను సవరించి 40 మంది పైన విద్యార్థులు ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికోక ఉపాధ్యాయుణ్ణి కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టాలని TSUTF జనగామ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జనగామ గ్రామీణ మహా సభ శ్రీధర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రకరకాల మేనేజ్మెంటుల రూపంలో రోజుకో కొత్త పేరుతో తెరపైకి వస్తున్న బడులకు బదులుగా ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం లక్ష్యంగా విద్యారంగ అభివృద్ధికై *రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన ఎడ్యుకేషన్ పాలసీ ప్రకటించి అమలుపరచాలన్నారు.* ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలైన *పర్యవేక్షణ అధికారుల నియామకానికై సర్వీస్ రూల్స్ రూపకల్పన, ఎంప్లాయిస్ హెల్త్ కార్డు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పూర్తిస్థాయి అమలుకై చర్యలు, పిఆర్సి సాధన, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఎల విడుదల, పెండింగ్ బిల్లుల జమ, ఎం జె పి గురుకులాల టైం టేబుల్ మార్పు* తదితర సమస్యల సాధన దిశగా రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు అనంతరం నూతన కమిటీ ని జిల్లా కార్యదర్శి కృష్ణ మూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది *అధ్యక్షులు* B.శ్రీధర్ ,ZPHS పెద్ద పహాడ్ *ప్రధాన కార్యదర్శి* R..మహేష్ ,MPPS వెంకీర్యాల *ఉపాధ్యక్షులు* 1.T. జంపయ్య ,ZPHS ఎర్ర గోళ్లపహాడ్ 2.R.శ్రీలత KGBV ,చౌడారం *కోశాధికారి* సత్యనారాయణ , MPPS బాకర్ నగర్ *కార్యదర్శులు* 1.రాధిక ,KGBV ,చౌడారం 2.రేష్మ MPPS ఎర్రకుంట తండా లు ఎన్నికయ్యారు B. శ్రీధర్ ,అధ్యక్షులు R. మహేష్ ,ప్ర.కార్యదర్శి జనగామ రూరల్ కమిటీ

జనగాం

ప్రజాస్వామ్యం ను అపహాస్యం చేసిన కాంగ్రెస్ నేత ల పై, కాంగ్రెస్ నాయకుల పై ఎఫ్ ఐ ఆర్ కేసు నమోదు చేయాలి :సౌడ రమేష్

ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ సమ్మేట్ కార్యక్రమంలో దేశ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయాలని డిసిపి గారికి కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ హైదరాబాదులో జరిగినటువంటి భారత సమ్మెటి కార్యక్రమంలో ఇటలీకి సంబంధించిన జియో కీమో ఫిలిటెక్ ఆ దేశ ఎంపీ మాట్లాడుతూ భారత్ కు సంబంధించి ఓటు చోరీ జరిగిందని అధికారం నుండి దిగిపో అని అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడం జరిగింది అని ఫార్నర్స్ ఆక్ట్ 2025 సెక్షన్ 29 సెక్షన్ 23 ప్రకారం విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు ఆ దేశాన్ని విమర్శించడం అంతరంగిక విషయాల పై మాట్లాడం దేశంలో పటాచక ఆటంక సృష్టించాలని చూస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అదే వేదిక పంచుకొని దేశద్రోహులకు ప్రోత్సాహాన్ని అందించడం జరిగిందని రాహుల్ గాంధీతో పాటు వేదిక పంచుకున్న దేశద్రోహులకు కఠిన శిక్షలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు శివరాజ్ యాదవ్ విడుదల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి ఐలోన్ అంజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య పల్లె కుమార్ రంగు రాములు చింత సృజన్ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బాష్పాక సుధాకర్ యువ మోర్చా రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వెంకటరెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవనజ్యోతి టౌన్ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ కదుగాయి రమేష దడిగ రవి శివకృష్ణ బసవ మహేష్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

17వ ఇండియన్ ఓపెన్ మెమోరి కాంపిటీషన్ 2026 లో ఎనిమిది మెడల్స్ విజేత రేణుకుంట్ల మురళి

17 వ ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమోరి కాంపిటీషన్ 2026 -సీనియర్ విభాగం లో రేణుకుంట్ల మురళి ఎనిమిది మెడల్స్ విజేత ———————————————————————— ఇండియన్ మెమోరి స్పోర్ట్స్ అకాడమీ జె ఎన్ టి యు హైదరాబాద్ లో నిర్వహించిన 17వ ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమోరి ఛాంపియన్షిప్ 2026 పోటీలు నిర్వహించడం జరిగిందని జనగామ జిల్లా ఇండియన్ మెమోరి స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రతినిధి రేణుకుంట్ల మురళి తెలిపారు.ఈ పోటీలో పది ఈవెంట్స్ నిర్వహించగా వాటిలో ఎనిమిది ఈవెంట్స్ లో విజేత గా నిలిచి ఎనిమిది మెడల్స్ ను పొందడం జరిగింది.”ఐ ఎం ఎస్ సి “ఫౌండర్,చైర్మన్ మల్టీపుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ స్క్వాడ్రాన్ లీడర్ జయసింహా సార్ చేతుల మీదుగా విజేత గా మెడల్స్ అందుకోవడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు. ఈ మెమోరి పోటీలకు మా బ్యాచ్ కి శిక్షణ ఇచ్చినటువంటి జయసింహా సర్ తో పాటు మెంటర్ గా వ్యవహారించిన డాక్టర్ శిరీష మేడం, అయ్యప్ప సర్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ పోటీలో చురుకుగా పాల్గొనడానికి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మా వెన్నంటూ ఉండి ప్రోత్సహించిన సునిల్ సర్ కు, ఎన్రోల్మెంట్, పోటీ నిర్వహణ మరియు సకల మౌలిక సదుపాయాలు రుచికరమైనా భోజనం,ప్రశాంత వాతావరణం లో పోటీలు నిర్వహించి, వసతులు కల్పించి మాకు సహకరించిన డాక్టర్ శ్రీనివాస్ కు,జడ్జి లకు ఆర్బీటర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత చక్కని కార్యక్రమం విజయవంతం చేసిన ఐ ఎం ఎస్ సి మొత్తం టీం కు అభినందనలు, ధన్యవాదములు తెలిపారు. నాతో పాటు ఈ పోటీలో పలు రాష్ట్రా ల కేరళ, తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటక , ఝార్ఖండ్,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి పాల్గొన్న మిత్రులకు డాక్టర్ భావన కమల్ కుమార్ ,కమల్ కుమార్, హేమ సుమ శ్రీ, స్వామినాథ్, రాజేష్ కుమార్ లకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

జనగాం

తెలంగాణ సినీ కవుల సింగిడి పుస్తకాన్ని అందుకున్న జి. కృష్ణ

‘తెలంగాణ సినీ కవుల సింగిడి’ పుస్తకాన్ని అందుకున్న జి. కృష్ణ ————————————————————————– జనగామ, నవంబర్ 17,పున్నమి జిల్లా ప్రతినిధి తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన డా. తిరునగరి శరత్ చంద్ర రచించిన 95 మంది సినీ కవుల పరిచయ సంపుటి ‘తెలంగాణ సినీ కవుల సింగిడి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఘనంగా జరిగింది.‌ ఈ ప్రతిష్టాత్మక గ్రంథంలో‌ జనగామకు‌ చెందిన అభ్యుదయ రచయిత, సినీ గేయ కవి జి.వై. గిరి సినిమా పాటల పరిచయం 43వ పేజీలో ముద్రితమైంది. జి.వై.గిరి ‘ఆశాజ్యోతి’, ‘ధర్మవడ్డీ’, ‘దండోరా’ ‘పిల్లలు కాదు పిడుగులు’వంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాలకు అందించిన గీతాలు తెలుగు సినీ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా తన తండ్రి జి.వై. గిరి పేరిట కుమారుడు కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి. కృష్ణ అతిథుల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ విమర్శకులు వారాల ఆనంద్, ప్రముఖ సినీ కవి మౌనశ్రీ మల్లిక్, జె.కె. భార్గవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా ‘కవులు, కళాకారుల ఐక్యవేదిక’ తరపున రచయిత డాక్టర్ తిరునగరి శరత్ చంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఐక్యవేదిక కోశాధికారి అయిలా సోమనర్సింహాచారి, గొలుసుల ఎల్లయ్య, తేజ గుడికందుల తదితరులు పాల్గొని రచయితకు అభినందనలు తెలిపారు.

జనగాం

ఆరుతడి పంటల సాగును ప్రోత్సాహించాలి :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి ————————————————————— *రబీ ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక కార్యాచరణ.. రైతుల వివరాల నమోదు కోసం ప్రత్యేక ఆన్‌లైన్ యాప్* *రైతులు తమకు ఆసక్తి ఉన్న ప్రత్యామ్నాయ పంటలు, సాగు విస్తీర్ణం, వ్యవసాయ అవసరాలను ఏఈఓల ద్వారా నమోదు చేసుకోవాలి* *యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి* *ఆరుతడి పంటలు సాగుచేసే రైతుల వివరాలు సేకరించాలి* *రైతులకు అండగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం* *గ్రామాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి* *యాసంగి పంటల ప్రణాళికలో పంటల మార్పిడికి ప్రాధాన్యం* *రెండు రోజుల్లో ఆరుతడి పంటల సాగు వివరాలతో నివేదిక సమర్పించాలి* ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగుచేసి నష్టపోకుండా చూడాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలు అన్ని గ్రామాల్లో పర్యటించి, ఏ రైతు సాగు చేస్తున్నారో వివరాలు సేకరించి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఏఈవోలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రెండు రోజుల పాటు పర్యటించి ఆరుతడి పంటలు ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అందుకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించనుంది. నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. చలి కాలంలోనూ ఎండ తీవ్రత కనిపిస్తుండటంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. దీంతో తక్కువ నీటితో పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు రోజుల పాటు అన్ని గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులు వారీగా వివరాలు సేకరించనున్నారు. ఎవరైనా రైతులు వరిని సాగుచేసే ప్రయత్నాలు చేస్తే వారికి అవగాహన కల్పించి విరమింపజేయనున్నారు. *పంటల మార్పిడే ప్రధాన లక్ష్యం* ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగి పంటల సాగు కార్యచరణను ఈ నెల 19వ తేదీలోగా రూపొందించాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అందులో పంటల వైవిధ్యం, పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామాల వారీగా ఎలాంటి పంటలు, ఎంత విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారే దానిపై వివరాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా యాసంగి పంటల సాగు కార్యచరణ ప్రణాళిక, జిల్లా స్థాయి ప్రణాళిక పూర్తి చేయాల్సి ఉంటుంది. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యామ్నాయ పంటలపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించి, నీరు తక్కువ వినియోగమయ్యే పంటలు, ఆరుతడి పంటలు సాగు అంశాలను యాసంగి కార్యచరణ ప్రణాళికను పొందుపర్చనున్నారు. *సోలార్ ఫెన్సింగ్, డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, ప్రెజర్ గన్స్, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాల నమోదుకు అవకాశం* రబీ సీజన్‌కు సంబంధించి పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, వరికి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రైతుల పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, నీటి వనరులు, నీటి పారుదల పరికరాలు, ఇతర వ్యవసాయ అవసరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) తమ లాగిన్ ద్వారా రైతుల వివరాలను నమోదు చేయనున్నారు. రైతులు తమ గ్రామానికి సంబంధించిన క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి, తమకు ఆసక్తి ఉన్న పంటల రకాలు, సాగు విస్తీర్ణం, నీటి పారుదల సదుపాయాలు, ఇతర అవసరాలను నమోదు చేయించుకోవాలి. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కుసుమ, టమాటా, బీరకాయ, సొరకాయ, బెండకాయ, మిరప, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, తదితర పంటల సాగుపై రైతులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. ఆయా పంటలకు అవసరమైన సాగు విస్తీర్ణం, డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, ప్రెజర్ గన్స్ వంటి నీటి పారుదల పరికరాల అవసరాలను కూడా రైతుల వారీగా నమోదు చేయనున్నారు. *కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్* జిల్లాలో కోతుల బెడద కారణంగా పంటలకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు అవసరాలను కూడా యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఒకే ప్రాంతంలో 25 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న రైతులు సమూహంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆసక్తి చూపినట్లయితే, అటువంటి భూములను ఒక సోలార్ ఫెన్సింగ్ క్లస్టర్‌గా ఏర్పాటు చేసేలా ఏఈఓలు వివరాలను నమోదు చేయనున్నారు. ఇందుకు ఆసక్తి ఉన్న రైతులు తమ గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నవంబర్ 16వ తేదీ సాయంత్రం లోపు వివరాలను నమోదు చేయించుకోవాలి. కోతులు, ఇతర వన్యప్రాణుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు, 25 ఎకరాల విస్తీర్ణంలో రైతుల బృందం క్లస్టర్‌గా ఏర్పడి పొద్దుతిరుగుడు, వేరుశనగ, కూరగాయలు, తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు వస్తే, వారికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించి అవసరమైన సహకారం అందించడం జరుగుతుంది. *ఉద్యానవన పంటలు, పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సాహం* పంటల వైవిధ్యీకరణలో భాగంగా జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించనున్నారు. ముఖ్యంగా కూరగాయలు, టమాటా, బీరకాయ, సొరకాయ, బెండకాయ, మిరప, ఆకుకూరల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఒక మీటరు కంటే తక్కువ ఎత్తు పెరిగే పంటలకు స్ప్రింక్లర్ పద్ధతిలో నీటి పారుదల సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా మిరప, సుగంధ ద్రవ్యాలు, కలబంద తదితర పంటల సాగుకు అనువైన పంటల కలయికలను గుర్తించి రైతులను ప్రోత్సహించనున్నారు. *పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాల నమోదు* పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేపియర్ గడ్డి, పశుగ్రాస జొన్న, పశుగ్రాస మొక్కజొన్న తదితర పశుగ్రాస పంటల విత్తనాల అవసరాలను రైతుల వారీగా నమోదు చేయనున్నారు. అలాగే ఉద్యానవన శాఖకు సంబంధించిన మినీ ట్రాక్టర్ల అవసరాలను కూడా రైతుల వారీగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. *ఆధునిక సాగు పద్ధతులపై ప్రత్యేక దృష్టి* రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా తమ భూముల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా పత్తి సాగు చేస్తున్న రైతులను పంటల మార్పిడి వైపు ప్రోత్సహిస్తూ డ్రిప్ పద్ధతిలో కూరగాయలు, మిరప సాగు చేపట్టేలా అవగాహన కల్పించనున్నారు. మొక్కజొన్న సాగులో డ్రిప్ ఇరిగేషన్, సోలార్ ఆధారిత విధానాలను ప్రోత్సహించడంతో పాటు, పొద్దుతిరుగుడు సాగులో డ్రిప్ ఇరిగేషన్ మరియు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు, కలబంద సాగు, డ్రిప్ ఇరిగేషన్‌తో పసుపు, అల్లం సాగును ప్రోత్సహించనున్నారు. *రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా– రైతులు తమకు అవసరమైన పంటల రకాలు, సాగు విస్తీర్ణం, నీటి పారుదల పరికరాలు, సోలార్ ఫెన్సింగ్, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్లు, తదితర వ్యవసాయ అవసరాల వివరాలను నిర్ణీత గడువులోగా తమ గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాగు పద్ధతుల అమలు, వివిధ శాఖల సమన్వయంతో రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడం, సాగు ఖర్చులను తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆరుతడి పంటల రైతులకు ప్రోత్సాహం: డీఏఓ అంబికా సోనీ– రైతులు ఈ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దు. నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలి. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి.

జనగాం

వేరు లేనిదెక్కడి వృక్షం? ఇంటిని నిలబెట్టే ఇల్లాలి త్యాగం :సోమ సుబ్బరాజు స్టోరీ రైటర్, ఏ ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్

వేర్లు లేనిదెక్కడి వృక్షం? – ఇంటిని నిలబెట్టే ఇల్లాలి (Homemaker) త్యాగం ———————————————————– భూమి తనపై నడిచే ప్రతి ప్రాణి బరువును మోస్తూ, విత్తనాన్ని మొలకెత్తించి పంటనిస్తుంది. కానీ ఎప్పుడూ తన కష్టాన్ని చెప్పుకోదు. ఇల్లాలు కూడా భూమాత లాగే కుటుంబ సభ్యులందరి అవసరాలను తీరుస్తూ, ఇంటిని ఒక అందమైన తోటలా తీర్చిదిద్దుతుంది. ఒక మహావృక్షం పూలు పూసినా, ఫలాలు ఇచ్చినా అందరికీ పైకి కనిపించే కొమ్మలే గుర్తుంటాయి. కానీ నేల లోపల ఉండి నీటిని, పోషకాలను అందించే వేర్లు (Roots) ఎవరికీ కనిపించవు. బయట పనిచేసే భర్త కొమ్మల లాంటివాడైతే, ఇంటిని నిలబెట్టే భార్య ఆ చెట్టు వేర్ల లాంటిది. వేర్లు బలంగా ఉంటేనే చెట్టు పచ్చగా ఉంటుంది. సూర్యుడు ప్రతిరోజూ వెలుగునిచ్చినా, గాలి ప్రాణవాయువును అందించినా వాటికి ఎలాంటి ప్రతిఫలం ఆశించవు. ఇల్లాలి ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది.

జనగాం

ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్ 14 సెపక్రా క్రీడలు

ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్త్రా క్రీడలు ——————————————————— జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో రాష్ట్ర పాఠశాలల 70వ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన అండర్-14 బాలబాలికల (జూనియర్స్) సెపక్త్రా పోటీలు విజయవంతంగా ముగిశాయి. *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యవేక్షణలో గురువారం ప్రారంభమైన ఈ పోటీలు, శుక్రవారం హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్‌లతో ముగిశాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలికల, బాలుర జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. పోటీల విజేతలు బాలికల విభాగం: వరంగల్ – ప్రథమ స్థానం నిజామాబాద్ జిల్లా – ద్వితీయ స్థానం మహబూబ్ నగర్ – తృతీయ స్థానం బాలుర విభాగం: నల్గొండ జిల్లా – ప్రథమ స్థానం ఆదిలాబాద్ జిల్లా – ద్వితీయ స్థానం మహబూబ్ నగర్ జట్టు – మూడో స్థానం విజేతలకు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి బహుమతులు అందజేశారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు: బాలురు: కె. రిషిగ్యాన్ (నల్గొండ) సీహెచ్ హరీశ్ (ఆదిలాబాద్) ఆర్. గణేష్ (రంగారెడ్డి) ఇమ్మాన్యుయిల్ (మహబూబ్ నగర్) ఎస్. ప్రణవ్ (కరీంనగర్) కె. జేగందర్ (హైదరాబాద్) కె. రేవంత్‌కుమార్ (నిజామాబాద్) బాలికలు: దేవసోత్ స్వప్న (వరంగల్) సేనావత్ శ్రీవిద్య (రంగారెడ్డి) అంజని సాత్విక (నిజామాబాద్) టి. త్రివేణి (మహబూబ్ నగర్) స్నేహకుమారి (హైదరాబాద్) మాలౌతు నందిని (వరంగల్) మంద రుత్విక (కరీంనగర్) పి. రిషిత (మెదక్) ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గోర్ సింగ్, పరిశీలకుడు హరికృష్ణ, సెపక్త్రా రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నిర్వహణ కమిటీ బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్ను వ్యతిరేకిస్తూ బిజెపి నల్ల బ్యాడ్జిల తో నిరసన :సౌడ రమేష్ బిజెపిజిల్లా అధ్యక్షులు

ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ కార్యక్రమానికి హైదరాబాదుకు రాహుల్ గాంధీ రావడానికి వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలతో చౌరస్తాలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ భారత్ సమ్మేట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్లతో తెలంగాణ ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని భారత్ వ్యతిరేక శక్తులతో ఆటంక వాదులతో ఈ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం భారత్ వ్యతిరేక శక్తులను కూడగట్టుకొని దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని దేశంలో అస్థిర ధన సృష్టించి విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించి దేశ భద్రతను ఆటంకపరచాలని కాంగ్రెస్ చూస్తున్నదని భారతీయ జనతా పార్టీ ఉండగా కాంగ్రెస్ ఆటలు సాగవని దేశాన్ని అస్థిర పరచాలని చూసే దేశద్రోహులను తరిమికొట్టాలని క్షమించేది లేదని ఆ పార్టీలకు ప్రజలు తగిన సమయంలో తగిన మూల్యం చెల్లిస్తారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్ సీనియర్ నాయకులు అంకుగారు శశిధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి ఆయిలోని అంజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి దేవర ఎల్లయ్య మహిళా మోర్చా అధ్యక్షురాలు సాంబ జీవనజ్యోతి యువ మోర్చా అధ్యక్షులు తెల్లబోయిన హరీష్ పట్టణ అధ్యక్షులు బొమ్మ కంటి అనిల్ దూల్మిట్ట అధ్యక్షులు కోడం యాదగిరి మద్దూరు అధ్యక్షులు ఉదయ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్ మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మహిళా మోర్చా నాయకురాలు కళ్యాణి రమాదేవి కదుగాయి రమేష్ ఓబీసీ మోర్చా నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు