నడత నేర్పిన అమ్మను మరువకు
——————————————
నడత నేర్పిన అమ్మను మరువకు
నడక నేర్పిన నాన్నను మరువకు
మంచి ప్రవర్తన తో మెలిగినచో
మంచి ఫలితాలు వస్తాయి
చెడు ప్రవర్తనతో
మెలిగినచో
దుష్ట ఫలితాలు వస్తాయి…
కష్టాలెన్ని ఎదురైనా
చేపలాగా ఎదురీదాలి
లక్ష్య సాధనకై కృషి చేయాలి
తల్లి దండ్రుల ఆశయాలను
కడవరకు నెరవేర్చాలి…..
నడత నడకలు సక్కగా ఉంటే
జీవితం మంతా సఫలమే
వంకరటింకార వెళ్లినట్లయితే
దారం తెగిన గాలిపటం లాగా
చినిగిన ఇస్తారాకుల లాగా
చెల్లచెదారమవుతుంది జీవితమంతా…
జీవితం నీటి బుడుగ లాంటిది
శాశ్వతం ఏది లేదు ఈ లోకంలో
సాటి మనిషికి సాయం చేయాలి
మానవ సేవయే మాధవ సేవగా
పది మందికి సహాయం చేయాలి
సత్సంబంధాలు పెంచు కోవాలి…
—రేణుకుంట్ల మురళి
రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు
కలం పేరు :బిస్మరేయ్
ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ పోయెట్,రైటర్ &ఆథర్
