Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

విద్యార్థులకు భోజన ప్లేట్ లు వితరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

జనగామ, పున్నమి జిల్లా ప్రతినిధి :
జనగామ మండలం గానుగుపహాడ్ హరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ ఇంటర్నేషనల్ అబాద్ జనగాం అధ్యక్షులు వనమాల సోమయ్య ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల కృష్ణ ప్లేట్స్ మరియు వాటర్ బాటిల్స్, వాటర్ డ్రం, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను గ్రామ సర్పంచ్ శ్రీమతి సానబోయిన అనూష మహిపాల్ , ఉప సర్పంచ్ కొర్ర శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సానబోయిన అనూష మాట్లాడుతూ సమాజం మనకు ఎంతో ఇచ్చింది ఆ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సత్సంకల్పంతో లయన్స్ ప్రతినిధులు చేస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాచగోని బుచ్చమ్మ లయన్స్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు నాగబండి రవీందర్ అల్లాడి ప్రభాకర్ మరియు పాఠశాల ఉపాధ్యాయిని సుకన్య పాల్గొనడం జరిగింది.

విద్యార్థులకు భోజన ప్లేట్ లు వితరణ

విద్యార్థులకు భోజన ప్లేట్ లు వితరణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *