Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు -2026,దరఖాస్థుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 – దరఖాస్తుల ఆహ్వానం --------------------------------------------------------- జనగామ, ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నూతన బోధనా పద్ధతుల వినియోగం, పాఠశాల అభివృద్ధి మరియు సమాజంలో విద్య పట్ల అవగాహన…
  • జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 కొరకు అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.
  • *దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన వివరాలు:* 1.ప్రాథమిక పాఠశాల (PS) మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS) ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి (MEO) ధృవీకరణతో సమర్పించవలెను.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 – దరఖాస్తుల ఆహ్వానం
———————————————————
జనగామ, ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి :
జిల్లాలో ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నూతన బోధనా పద్ధతుల వినియోగం, పాఠశాల అభివృద్ధి మరియు సమాజంలో విద్య పట్ల అవగాహన పెంపొందించడంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి, ప్రోత్సహించుటలో భాగంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 కొరకు అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.
జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – 2026 కొరకు అర్హత మరియు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.
*దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన వివరాలు:*
1.ప్రాథమిక పాఠశాల (PS) మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS) ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి (MEO) ధృవీకరణతో సమర్పించవలెను.
2. ఉన్నత పాఠశాల (HS) ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయుల (Headmaster) ధృవీకరణతో సమర్పించవలెను.
3.ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో, సంబంధిత ధృవపత్రాలతో సహా సమర్పించవలెను.
4.ధృవీకరించిన దరఖాస్తులను 25.08.2026 సాయంత్రం 4.00 గంటలలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని గది నం. F-27, జనగామలో సమర్పించవలెను.
5.నిర్దేశిత గడువు అనంతరం అందిన దరఖాస్తులను స్వీకరించబడవు.
అర్హత ప్రమాణాలు మరియు ఎంపిక విధానం సంబంధిత ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు నిబంధనల ప్రకారం అమలు చేయబడును

Leave a comment

Your email address will not be published. Required fields are marked *