Thursday, 1 October 2026

Tag: కొత్తగూడెం

BHADRADRI

బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 29:(పున్నమి ప్రతినిధి ): హిందూ దేవుళ్ళని అవమానిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్ వ్యాఖ్యలని నిరసిస్తూ బిజెపి పిలుపు మేరకు యువమోర్చ ఆధ్వర్యంలో ఇల్లందులో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చెయ్యటం జరిగింది.ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం హిందూ దేవులని అవమానించటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.కోట్లాదిమంది హిందువులు కొలిచే దేవుళ్ళకి కూడా కులం మతం పేదోడు ఉన్నోడు అని విడదీసిమాట్లాడటం రేవంత్ నీచ మనస్తాత్వనికి నిదర్శనం అని తెలిపారు,హిందూ దేవుళ్ళని దూశిస్తే బిజెపి పార్ట్ చూస్తూ ఊరుకోదని సీఎం వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారులేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు…

BHADRADRI

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 24:(పున్నమి ప్రతినిధి ): ఈ రోజు కొత్తగూడెం జిల్లాపాల్వంచ పెద్దమ్మతల్లి గుడి దగ్గరలోని ఫంక్షన్ హాల్ లొ mla సమక్షంలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు పంపకాలు విషయంలో BC కేటగిరీ కి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు mla ని నీలాదీశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో అన్నివర్గాలకి ఇళ్లు కేటాయించాలని ఒకవర్గనికేయివ్వటం అన్యాయమని నీలాదీశారు. బీసీలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పారు..

BHADRADRI

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 17:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం కేంద్రం లొ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయజెండా ఎగరావేయటం జరిగింది.సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్బంగా స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆశీర్వాద దీపం వెలిగించటం జరిగింది.ఈ కార్యక్రమం లొ బీజేపీ కార్మిక సెల్ కో కన్వినర్ సబ్బానీ రాజేష్ గారు, మరియు వివిధ మోర్చాలా నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానికి ఆశీర్వాదం తెలిపారు..

BHADRADRI

బీజేపీ ఆధ్వర్యంలో లేబర్ సెల్ విభాగం సమావేశం )

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 15:(పున్నమి ప్రతినిధి ) ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ కార్మిక సెల్ విభాగం అయ్యిన బీజేపీ మజ్ దూర్ మోర్చకార్యకర్తల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయం లొ జరిగింది.ఈ సమావేశానికి కార్మిక సెల్ విభాగం జిల్లా కో కన్వీనర్ సబ్బానీ రాజేష్ గారు అధ్యక్షాత వహించారు.రాజేష్ గారు మాట్లాడుతూ న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (NEHS)మార్గదర్శకాల ముఖ్యంశాల గురించి వివరించారు.నెహస్ మార్గదర్శకాలు 17జులై 2026నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు.వక్కో చికిత్స ఎపిసోడ్ కి 3లక్షల వరకు కవరేజ్ ఉంటది.చికిత్స 3లక్షలు దాటినా కవరేజ్ వర్తిస్తుంది కాబట్టి అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.3నుండి 10లక్షల వరకు ఫ్రీ క్లెయిమ్ ని ప్రత్యేక శుభాకాంక్షలు సబ్ కమిటీ పరిశీలిస్తుంది అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,సర్వీస్ పెన్షనర్లు,ఫ్యామిలీ పెన్షనర్లు అర్హులుగా వుంటారు.దీనిని అర్హత గల వారు అందరు ఉపయోగించుకోవాలని తెలిపారు

BHADRADRI

కొత్తగూడెం లొ బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం ))

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 12:(పున్నమి ప్రతినిధి ):యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కొత్తగూడెం పరిధిలో బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు ఉమ్మడి సమ్మె విజయవంతమైంది. వారానికి ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదనను ఆమోదించాలని, ఉద్యోగులకు న్యాయమైన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌బీఐ ఆర్‌బీఓ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏజీఎస్ కె. శ్రీకాంత్, రీజినల్ సెక్రటరీ కె. అర్జున్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అరుణ్ కుమార్, శ్రీకాంత్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు కె. నిశ్చల్, విద్యాసాగర్, ఎస్‌బీఐ అవార్డు స్టాఫ్ లీడర్ భవానీ శంకర్, డీసీసీబీ లీడర్ వెంకట కృష్ణ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె, అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

BHADRADRI

వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి ))

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 10:(పున్నమి ప్రతినిధి ): కొత్తగూడెం లోనిగణేష్యా టెంపుల ఎదురుగ వున్నా యామిని మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లొ చిన్నారి మృతి కలకలం లేపింది. మంగళవారం రాత్రి ఆరు నెలల బాబు కి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటే హుటాహుటిన కొత్తగూడెం లోని యామిని హాస్పిటల్ కి తీసుకువచ్చారు.అక్కడ చికిత్స పొందుతూ బాబు చనిపోయాడు.చిన్నారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అని తల్లితండ్రులు బంధువులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకి దిగారు.ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు శ్వాస లొ ఇబ్బందిగా ఉండటంతో వెంటిలేటర్ మీద పెట్టాలని ఫీజు తీసయకున్నారు.ఆ తరువాత వైద్యం చేయగా బుధవారం తెల్లవారుజామున స్కానింగ్ బ్లడ్ రిపోర్ట్ పేరుతో 70వేల రూపాయలవరకు వసూలు చేసి కొద్దిసేపటి తరువాత బాబు చనిపోయాడని వైద్యులు చెప్పటంతో వాళ్ళు అవక్కాయ్యారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బాబు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు., విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తల్లితండ్రులకి ధైర్యం చెప్పారు, చిన్నారి మృతికి కారణం అయ్యిన హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పటం తో ఆందోళన విరమించారు…

BHADRADRI

బీజేపీ మజ్దూర్ మోర్చా కార్మిక విభాగం కార్యకర్తలు సమూహం )

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 7:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం పట్టణం లొ బీజేపీ పార్టీ కార్యాలయం లొ ఆదివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న భారతీయ కార్మిక సెల్ విభాగం మజ్దూర్ మోర్చా విభాగం కార్యకర్తలు సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్మిక విభాగం సెల్ కో కన్వినర్ రాజేష్ గారి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది.ఈ సమావేశం లొ రాజేష్ గారు మాట్లాడుతూ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరు అర్హులే అని తెలిపారు, ఇన్సూరెన్స్ కి తెల్ల రేషన్ కార్డు తప్పని సరిగా అవసరం.ఏడాదికి 22rs కట్టాలి, 5ఇయర్స్ కి కలిపి 110rs కట్టాలి.ఇన్సూరెన్స్ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు మరియు ప్రమాదంలో మరణించినప్పుడు ఉపయోగపడుతుంది . దీనికి 18నుండి 55ఇయర్స్ వున్నా స్త్రీ పురుషులందరు అర్హులు. ఇది చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు చలానా జతచేసి లేబర్ ఆఫీస్ లొ ఇవ్వాలని సూచించారు.కావలసిన వాళ్ళు 6304438161నెంబర్ కి సంప్రదించాలని కోరారు..

BHADRADRI

FFS తో మేము హ్యాపీగా లేము )…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సెప్టెంబర్ 4:(పున్నమి న్యూస్ )… ఎరువుల బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (FFS) యాప్‌ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే విధానం తమకు అనుకూలంగా లేదని వాపోయారు. హేమచంద్రాపురం రైతులు బైకాని రామ్మూర్తి, తరాల శ్రీను, కుందూరు గోపాల్‌రెడ్డి, గోలి శ్రీను, రాజబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ భూములు 1/70 చట్టం పరిధిలో ఉండటంతో భూములు కొనుగోలు చేసినప్పటికీ రికార్డుల్లో, పహాణిలో పేర్లు మారడం లేదని తెలిపారు. దీంతో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో ఎరువులు బుక్ చేసుకునే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘‘మా దగ్గర స్మార్ట్‌ఫోన్లు లేవు.. చిన్న ఫోన్లతో ఆన్‌లైన్‌లో ఎరువులు ఎలా బుక్ చేసుకోవాలి?’’ అని ప్రశ్నించారు. దుకాణాల్లో బుకింగ్ చేయించుకునే ప్రయత్నం చేసినా కొద్ది సమయంలోనే స్టాక్ లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ, ఎప్పుడు అందిస్తారో కూడా స్పష్టత ఉండటం లేదన్నారు. మరోవైపు ఎరువులు, వ్యవసాయ మందుల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరింత భారంగా మారాయని రైతులు తెలిపారు. మందుల కట్ట ధరలు రూ.600 నుంచి రూ.700, రూ.800 వరకు పెరిగాయని చెప్పారు. విత్తనాలు సైతం సకాలంలో అందుబాటులో ఉండటం లేదని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వాలు కొత్త కొత్త యాప్‌లు తీసుకొస్తూ రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్నాయి కానీ మేము మాత్రం సంతోషంగా లేం’’ అని రైతులు పేర్కొన్నారు. అప్పులు చేసి సాగు చేస్తున్న తమపై అదనపు భారం పడుతోందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు, పహాణిలో పేర్లు నమోదు కాని భూ యజమానులకు ప్రత్యామ్నాయ విధానం కల్పించాలని, గతంలో మాదిరిగా దుకాణాల ద్వారా ఎరువులు సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హేమచంద్రాపురం రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

BHADRADRI

భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ కి కేంద్ర గ్రీన్ సిగ్నల్ )

భద్రాద్రి కొత్తగూడెం :సెప్టెంబర్ 3:(పున్నమి ప్రతినిధి ): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి రైలు ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రాజెక్ట్ కి కేంద్రం ఆమోదం తెలిపింది.పాండురంగాపురం నుండిమల్కాంగిరి వరకు 173కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని 2900కోట్లతో నిర్మించ నున్నారు.2032 నాటికీ పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ మార్గంలో 132కొత్త రైల్వేస్టేషన్ లు నిర్మించనున్నారు.దీంతో భక్తులు నేరుగా భద్రాచలం చేరుకునే అవకాశం వుందిమొత్తం పొడవు 173.6కిలోమీటర్లు. అంచనా వ్యయం దాదాపు 2864కోట్లు.ఈ ప్రాజెక్ట్ ని 5ఏళ్లలో పూర్తిచేయ్యాలని లక్ష్యం గ పెట్టుకున్నారు.రైళ్ళ వేగo ఈ మార్గం లొ గంటకు 160 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తాయి.పాండురంగాపురం నుండి ప్రారంభమై ఒడిశా లోని మల్కాంగిరి వరకు కలపబడుతుంది.పాండురంగ పురం నుండి బయలుదేరి గోదావరి కొత్తవంతెన మీద నుండిభద్రాచలం చేరుకుంటుంది.అక్కడినుండి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా మీదుగా ఒడిశా లోని మల్కాంగిరి వరకు చేరుకుంటుంది.

BHADRADRI

కొత్తగూడెం విమానాశ్రయo కలకి రెక్కలు )

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 1:(పున్నమి ప్రతినిధి ):: సెప్టెంబరు 7న క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాంకేతిక బృందం •నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలపై లోతైన అధ్యయనం •నివేదిక అనుకూలిస్తే తక్షణణమే తదుపరి చర్యలు •కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూసేకరణ తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను, విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాకు కలిగే రవాణా, పారిశ్రామిక, పర్యాటక ప్రయోజనాలను కేంద్ర మంత్రికి వివరించారు. గత అడ్డంకులు.. కొత్త ఆశలు.. గతంలో గుర్తించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలడంతో, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొత్తగా నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రాంతాల్లో భూసేకరణ సౌలభ్యం, రన్‌వే నిర్మాణానికి అనువైన భూభాగం, వాతావరణ పరిస్థితులు వంటి కీలక అంశాలను నిపుణుల బృందం నిశితంగా అధ్యయనం చేయనుంది. ఢిల్లీ వేదికగా కీలక భేటీ.. ఈ పరిణామాలపై మంగళవారం న్యూఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి సవివరంగా తీసుకెళ్లారు. జిల్లా అభివృద్ధిలో విమానాశ్రయం పోషించే పాత్రను, స్థానికుల రవాణా అవసరాలను మంత్రి తుమ్మల వివరించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన వెంటనే విమానాశ్రయం ఏర్పాటుకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. మైత్రి పునాదిగా విజ్ఞప్తి.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో తనకున్న చిరకాల మైత్రిని కూడా మంత్రి తుమ్మల గుర్తుచేశారు. రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత నేత ఎర్రన్నాయుడుతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, అలాగే జిల్లా ప్రజలకు విమానాశ్రయం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రికి సవివరంగా వివరించారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరో రెండు ప్రతిపాదనలపైనా కదలిక.. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయ ప్రతిపాదనలపైనా కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల అంశంపై సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీన్నిబట్టి రాష్ట్రవ్యాప్తంగా విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక సానుకూలంగా వస్తే.. భద్రాద్రి కొత్తగూడెం గగనతలంలో విమానం రెక్కలు విప్పే రోజు ఎంతో దూరంలో లేదన్న ఆశాభావం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.