వర్షాల ప్రభావంతో అప్రమత్తం…. శుక్రవారం పాఠశాలలకు సెలవు.!
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 25, శుక్రవారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటనలో తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సెలవు విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ తదితర అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఈ సెలవును కాంపెన్సేటరీ హాలిడేగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు DEO తెలిపారు. తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సెలవు విషయాన్ని గమనించాలని సూచించారు.











