Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Tirumala

తిరుపతి

తిరుమలలో పది రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బంది ప్రత్యేక దర్శనాలూ నిలిపివేసింది. అక్టోబర్ 10 నుంచి 19 వరకు వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. భక్తులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ కోరింది.

తిరుపతి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమల, సెప్టెంబర్ 21, 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 20న మొత్తం 72,019 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ రోజు తిరుమలలో నమోదైన భక్తుల వివరాలు: 👥 మొత్తం భక్తులు: 72,019 🪒 తలనీలాలు సమర్పించిన భక్తులు: 25,431 💰 హుండీ కానుకలు: ₹3.50 కోట్లు 🍬 లడ్డూ విక్రయాలు: 4.64 లక్షలు 🍚 అన్నప్రసాదం: 2.03 లక్షలు 🏥 అశ్విని ఆసుపత్రి సేవలు పొందిన వారు: 3,736 ⏳ నేటి దర్శన పరిస్థితి సెప్టెంబర్ 21న తిరుమలలో ప్రస్తుతం 6 వెయిటింగ్ కంపార్టుమెంట్లు ఉన్నాయి. SSD టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితులను గమనించి తమ దర్శన ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచన. ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా.. గోవిందా!

తిరుపతి

తిరుమల భక్తులకు ముఖ్య సమాచారం.. సెప్టెంబర్ 23 వరకు SSD, DD టోకెన్ల జారీ నిలిపివేత

సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో SSD, DD టోకెన్ల జారీకి విరామం తిరుమల, సెప్టెంబర్ 20:తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల దర్శన ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో SSD, DD టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. భక్తుల రద్దీ, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న సాయంత్రం 4 గంటల నుంచి దర్శన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి టోకెన్ల ద్వారా దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. టోకెన్లు నిలిపివేసిన సమయంలో తిరుమలకు వచ్చే భక్తులు సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని సూచించింది. 📌 ముఖ్య తేదీలు 🔹 సెప్టెంబర్ 14–23: SSD, DD టోకెన్ల జారీ నిలిపివేత🔹 సెప్టెంబర్ 23, సాయంత్రం 4 గంటలు: టోకెన్ల జారీ పునఃప్రారంభం🔹 సెప్టెంబర్ 24 నుంచి: టోకెన్ల ద్వారా దర్శనం భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఓం నమో వేంకటేశాయ 🙏 | గోవిందా గోవిందా!

తిరుపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సప్తగిరి.

తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో సినీ నటుడు సప్తగిరి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు తీర్థప్రసాదాలు అందించారు. సప్తగిరి ని చూడటానికి అభిమానులు చుట్టుముట్టారు. అనంతరం అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

తిరుపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిని నటుడు సప్తగిరి.

తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో తెలుగు సినీ హస్య నటుడు సప్తగిరి దర్శించుకున్నారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుపతి

శ్రీవారిని దర్శించుకున్న విజయ్ సాయి రెడ్డి

శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని వెల్లడించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం ప్రజాపక్షంగా నిలబడటమే పార్టీ లక్ష్యమన్నారు. ప్రజావాణిని అసెంబ్లీ, పార్లమెంట్‌లో బలంగా వినిపిస్తానని చెప్పారు. బాధ్యతాయుత ప్రతినిధిగా పనిచేస్తానన్నారు. ఈ నెలలోనే విజయవాడలో విస్తృత స్థాయి మీడియా సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, కార్యాచరణను వెల్లడిస్తానని తెలిపారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.