అక్టోబర్ 1న స్వచ్ఛంద రక్తదాన శిబిరం
విజయనగరం, సెప్టెంబర్ 28: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1న కోట జంక్షన్‌లోని ఎన్‌వీఎన్ బ్లడ్ బ్యాంక్ వద్ద స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ తెలిపారు. మాతృభూమి సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. సేవా రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

