Monday, 28 September 2026
  • Home  
  • మొండిగౌరెల్లిలో వెలుగులోకి వస్తున్న దళారుల అక్రమ బాగోతాలు
- రంగారెడ్డి

మొండిగౌరెల్లిలో వెలుగులోకి వస్తున్న దళారుల అక్రమ బాగోతాలు

మొండిగౌరెల్లిలో వెలుగులోకి వస్తున్న దళారుల అక్రమ బాగోతాలు భూమి లేకున్నా నకిలీ పాసుబుక్కుల ఆరోపణలు.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు మొండిగౌరెల్లి, ఆగస్టు 11: మొండిగౌరెల్లి గ్రామంలో భూసేకరణకు సంబంధించి రోజురోజుకూ పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ ఆరోపించారు. కొంతమంది దళారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో భూములు లేకపోయినా నకిలీ పాసుబుక్కులు సృష్టించుకుని పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన పూర్తి సర్వే వివరాలను బహిర్గతం చేయకుండా, అవార్డు పాస్ చేయాలని అధికారులపై కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. నూతన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని అధికారులను కోరుతున్నామని చెప్పుకోవడం కేవలం రాజకీయ ప్రచారం కోసమే తప్ప, రైతులకు నిజంగా మేలు చేయాలనే ఉద్దేశం లేదని ఆరోపించారు. సర్వే ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తూ, రైతులపై తమకు ఎంతో ప్రేమ ఉన్నట్లు, న్యాయం చేసేందుకు పోరాడుతున్నట్లు నటిస్తున్నారని ప్రవీణ్ విమర్శించారు. ప్రత్యేకంగా సర్వే నంబర్లు 19, 68లోని కబ్జా భూములకు పరిహారం పేరుతో కొంతమంది నాయకులు గుట్టలు, బండలు వంటి భూములకు సైతం కోట్ల రూపాయల పరిహారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై రైతులను మభ్యపెడుతూ తమ స్వలాభం కోసం గ్రామ రైతులను నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భూసేకరణకు సంబంధించిన సర్వే వివరాలు, అర్హుల జాబితా, పరిహారం వివరాలను అధికారులు పారదర్శకంగా బహిర్గతం చేయాలని గోడుకొండ్ల ప్రవీణ్ డిమాండ్ చేశారు.

మొండిగౌరెల్లిలో వెలుగులోకి వస్తున్న దళారుల అక్రమ బాగోతాలు

భూమి లేకున్నా నకిలీ పాసుబుక్కుల ఆరోపణలు.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు

మొండిగౌరెల్లి, ఆగస్టు 11:
మొండిగౌరెల్లి గ్రామంలో భూసేకరణకు సంబంధించి రోజురోజుకూ పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ ఆరోపించారు. కొంతమంది దళారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో భూములు లేకపోయినా నకిలీ పాసుబుక్కులు సృష్టించుకుని పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

భూసేకరణకు సంబంధించిన పూర్తి సర్వే వివరాలను బహిర్గతం చేయకుండా, అవార్డు పాస్ చేయాలని అధికారులపై కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. నూతన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని అధికారులను కోరుతున్నామని చెప్పుకోవడం కేవలం రాజకీయ ప్రచారం కోసమే తప్ప, రైతులకు నిజంగా మేలు చేయాలనే ఉద్దేశం లేదని ఆరోపించారు.

సర్వే ప్రారంభమైనప్పటి నుంచి కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తూ, రైతులపై తమకు ఎంతో ప్రేమ ఉన్నట్లు, న్యాయం చేసేందుకు పోరాడుతున్నట్లు నటిస్తున్నారని ప్రవీణ్ విమర్శించారు.

ప్రత్యేకంగా సర్వే నంబర్లు 19, 68లోని కబ్జా భూములకు పరిహారం పేరుతో కొంతమంది నాయకులు గుట్టలు, బండలు వంటి భూములకు సైతం కోట్ల రూపాయల పరిహారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై రైతులను మభ్యపెడుతూ తమ స్వలాభం కోసం గ్రామ రైతులను నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భూసేకరణకు సంబంధించిన సర్వే వివరాలు, అర్హుల జాబితా, పరిహారం వివరాలను అధికారులు పారదర్శకంగా బహిర్గతం చేయాలని గోడుకొండ్ల ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.