Thursday, 10 September 2026

Tag: TalasaniSrinivasYadav

హైదరాబాద్

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: తలసాని

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రి, ముసారాంబాగ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులకే రేవంత్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పాలన, దోపిడీ అంశాలపై వారం రోజులపాటు ప్రజల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీలోనే సీఎం, మంత్రులు గడుపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ

రేవంత్‌పై తలసాని తీవ్ర విమర్శల దాడి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రారంభమైందని, తమ హయాంలో 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండానే ఆస్పత్రిని ప్రారంభించారని ఆరోపించారు. 22ఏ భూముల వ్యవహారం, హౌస్ అరెస్టులపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.