క్రీడలతో సృజనాత్మకత పెంపొందుతుంది: శ్రీ శాంతినికేతన్ చైర్మన్ సుధాకర్
నంద్యాల : క్రీడలు విద్యార్థుల్లోని అంతర్లీన సృజనాత్మక శక్తిని వెలికితీసి, మానసిక పరిణతిని పెంచుతాయని శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ తెలిపారు.ఈనెల 22న నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన “జిల్లా ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్”లో శ్రీ శాంతినికేతన్ (CBSE) విద్యార్థులు ప్రతిభ చాటారు. నంద్యాల (కె.ఎస్.కె.న్యూస్): క్రీడలు విద్యార్థుల్లోని అంతర్లీన సృజనాత్మక శక్తిని వెలికితీసి, మానసిక పరిణతిని పెంచుతాయని శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈనెల 22న నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన “జిల్లా ఫస్ట్ ర్యాంకింగ్ టోర్నమెంట్”లో శ్రీ శాంతినికేతన్ (CBSE) విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్-14: జే.సీ. సంతోష్ (1వ స్థానం), సి. పవన్ (2వ స్థానం), బి. వరుణ్ (3వ స్థానం), కే. యజ్ఞచరణ్ (4వ స్థానం) అండర్-16: వి. చైతన్య సింహ (2వ స్థానం) అండర్-12: జే. అభిరామ్ (5వ స్థానం) విజేతలకు పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించారు. వచ్చే నెల 12న జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు రాణించాలని చైర్మన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిచ్చిన పి.ఇ.టి (PET)లను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు. విజేతలకు పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించారు. వచ్చే నెల 12న జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు రాణించాలని చైర్మన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిచ్చిన పి.ఇ.టి (PET)లను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు.










