Sunday, 20 September 2026

Tag: RJC college khammam

ఖమ్మం

కోదాడ జాబ్ మేళాలో ఖమ్మం ఎస్‌బీఐటీ విద్యార్థుల ఎంపిక

ఖమ్మం /కోదాడ రాష్ట్ర మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో నిర్వహించిన జాబ్ మేళాలో ఖమ్మం ఎస్‌బీఐటీ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ కంపెనీలు నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు పలు కేటగిరీలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.