అసెంబ్లీ గేట్ వద్ద ఘర్షణ.. బీఆర్ఎస్ నేతలపై కేసు
హైదరాబాద్ అసెంబ్లీ గేట్ నం.3 వద్ద జరిగిన ఘర్షణపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లను FIRలో చేర్చారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగినట్లు పోలీసులు ఆరోపించారు. వీడియో, సీసీటీవీ, మీడియా ఫుటేజీ ఆధారంగా నేతల పాత్రను నిర్ధారించి దర్యాప్తు చేపట్టనున్నారు.


