పాస్టర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ పాస్టర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు స్నేహభావం, ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఊరందురు సురేంద్రబాబు, ఎం. బర్నాబాస్, గడ్డం హనోక్, కె.ఎస్. రాజు, ఎ. రమేష్, ఎం. జాషువ, జె. కిషోర్ కుమార్, ఎనోష్, సునీల్ గవాస్కార్, సునీల్ కుమార్, శశి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని గిరిధర్ రెడ్డి ఆకాంక్షిస్తూ, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగాలని కోరారు.


