Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: karthik yadav

కడప

🎂 డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్‌లో సుధీర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు 🎉

🎂 డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్‌లో సుధీర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు 🎉 కడప, ఆగస్టు 23: ప్రైమ్9 కడప జిల్లా ఇన్‌చార్జ్ శ్రీ సుధీర్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్‌లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ గారు కేక్ కట్ చేసి, సహచరులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులతో కలిసి వివాహ వార్షికోత్సవ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సుధీర్ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన దాంపత్య జీవితం ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. దంపతులు ఇలాగే అన్యోన్యంగా, ఆనందంగా జీవిస్తూ మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకున్నారు. కేక్ కటింగ్ అనంతరం సుధీర్ గారు తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా జరిగింది. 💐 సుధీర్ దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐 – పున్నమి ప్రతినిధి

కడప

భక్తులకు ఆపన్నహస్తం.. ఘనంగా అన్నదాన కార్యక్రమం

భక్తులకు ఆపన్నహస్తం.. ఘనంగా అన్నదాన కార్యక్రమం కడప, ఆగస్టు 23: పున్నమి ప్రతినిధి కడప నగరంలోని ఇంద్రానగర్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ పాలకొండ రాయ దేవస్థానం వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏటూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో దేవస్థానానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి భోజనం అందించారు. దేవస్థానానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ పాలకొండ రాయ స్వామివారిని దర్శించుకుంటుంటారని నిర్వాహకులు తెలిపారు. దేవుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక సేవతో పాటు అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆప్యాయంగా భోజనం వడ్డించి, అనంతరం మంచినీటి సదుపాయం కూడా కల్పించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా దేవస్థానానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం అందించారు. ఏటూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేవుని దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేరకు సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ముఖ్యంగా అన్నదానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని అన్నారు. భక్తులకు అవసరమైన సమయంలో ఆహారం అందించడం ద్వారా సేవా భావాన్ని చాటుకోవచ్చని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. దేవస్థానం వద్దకు వచ్చిన పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏటూరి రామచంద్రారెడ్డిని అభినందించారు. భక్తిశ్రద్ధలతో దేవస్థానానికి వచ్చే వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు, భక్తులు, స్థానికులు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు తదితరులు పాల్గొన్నారు.

కడప

బిషప్‌ను తొలగించాలని CSI సైనడ్‌కు పాస్టర్ల ఫిర్యాదు

బిషప్‌ను తొలగించాలని CSI సైనడ్‌కు పాస్టర్ల ఫిర్యాదు పున్నమి ప్రతినిధి, కడప: రాయలసీమ డయాసిస్‌ CSI బిషప్‌ పెయ్యల ఐజాక్‌ వరప్రసాద్‌ వ్యవహార శైలిపై పలు తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను బాధ్యతల నుంచి తొలగించి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ CSI సైనడ్‌కు ఫిర్యాదు చేసినట్లు సీనియర్‌ పాస్టర్‌ రెవరెండ్‌ ఐక్యత రావు తెలిపారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పాస్టర్లు స్పష్టం చేశారు. ఈ నెల 19న చెన్నైలో CSI సైనడ్‌ మోడరేటర్‌కు సమర్పించిన అప్పీల్‌లో తమ సస్పెన్షన్‌, మంత్రిత్వ బాధ్యతల నుంచి తొలగింపు, జీతాల నిలిపివేతతో పాటు CSI హైస్కూల్‌ స్థలాలకు సంబంధించిన లీజులు, భూ వ్యవహారాలు, కోర్టు ఆదేశాలు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఐక్యత రావు తెలిపారు. తమపై తీసుకున్న చర్యల్లో సరైన విధివిధానాలు పాటించలేదని పేర్కొంటూ సైనడ్‌కు వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై సైనడ్‌ నుంచి సానుకూల స్పందన లభించిందని, ఆరోపణలపై త్వరలో విచారణ జరిపి బిషప్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పాస్టర్లు తెలిపారు. CSI హైస్కూల్‌ గేటుకు తాళం వేయడంపై ఆగ్రహం శనివారం కడప CSI హైస్కూల్‌ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై పాస్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసే వాహనానికి కూడా గేటు తీయకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర గేటు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రైవేట్‌ వ్యక్తులు పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పాస్టర్లు తెలిపారు. పాఠశాల ప్రధాన గేటుకు ప్రైవేట్‌ వ్యక్తులు తాళం వేసే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించినట్లు తెలిపారు. ఘటనను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులకు నివేదిస్తామని అడిషనల్‌ కమిషనర్‌ పేర్కొన్నట్లు పాస్టర్లు వెల్లడించారు. విద్యార్థుల రాకపోకలు, మధ్యాహ్న భోజనం సరఫరా వంటి పాఠశాల ప్రాథమిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలు దారుణమని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. ‘అవినీతి, అక్రమాల బిషప్‌ మాకు వద్దు’ గేటు వద్దకు చేరుకున్న పాస్టర్లు బయట నుంచే నిరసన వ్యక్తం చేశారు. “అవినీతి, అక్రమాల బిషప్‌ మాకు వద్దు” అంటూ బ్యానర్‌ ప్రదర్శిస్తూ, CSI సైనడ్‌కు సమర్పించిన వినతిపత్రాన్ని మీడియాకు చూపించారు. CSI హైస్కూల్‌ ప్రాంగణాన్ని విద్యా ప్రయోజనాలకే పరిమితం చేయాలని, విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు చేపట్టకూడదని వారు డిమాండ్‌ చేశారు. సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలపై విచారణకు డిమాండ్‌ సీనియర్‌ పాస్టర్‌ ఐక్యత రావు మాట్లాడుతూ నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 262, 236లోని 1.26 ఎకరాలు, 2.71 ఎకరాల భూములకు సంబంధించి CSI ట్రస్ట్‌ అనుమతి లేకుండా సబ్‌డివిజన్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఆరోపించారు. అధికారిక అనుమతులు, అధికార ప్రతినిధిత్వం, సంబంధిత రిజిస్ట్రేషన్‌ పత్రాల చెల్లుబాటుపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అలాగే 2023లో డాక్యుమెంట్‌ నంబర్లు 1242, 1243, 1244, 1245గా పేర్కొన్న మార్ట్గేజ్‌/సెటిల్‌మెంట్‌ డీడ్స్‌, కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమర్పించినట్లు చెబుతున్న కొన్ని పత్రాలపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సర్వే నంబర్‌ 236-1లోని Door No.2/19-2-3కు సంబంధించిన పత్రాలు, 2024లో రిజిస్టర్డ్‌ రెంటల్‌ డీడ్‌ నంబర్లు 8179, 8180 ద్వారా జరిగినట్లు పేర్కొంటున్న లావాదేవీలపై కూడా సమగ్ర విచారణ జరపాలని పాస్టర్లు డిమాండ్‌ చేశారు. అయితే, ఈ పత్రాల చెల్లుబాటు, భూ విభజన, నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలపై సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, మున్సిపల్‌ అధికారులు అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని కోరారు. భూ రికార్డులు, సబ్‌డివిజన్‌ అనుమతులు, నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లీజు ఒప్పందాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనుమతులు చట్టబద్ధంగా లేవని విచారణలో తేలితే వాటిని రద్దు చేసి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. CSI ట్రస్ట్‌ అసోసియేషన్‌ ఆస్తులకు నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరించి ఉంటే, సంస్థ నిబంధనల ప్రకారం, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బిషప్‌ను తొలగించే వరకు ఉద్యమం పాస్టర్లు మాట్లాడుతూ, రాయలసీమ డయాసిస్‌లో జరుగుతున్నట్లు తాము ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలు, పరిపాలనా అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. CSI సంస్థ ఆస్తులు, విద్యాసంస్థలు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. “బిషప్‌పై వచ్చిన ఆరోపణలను CSI సైనడ్‌ స్వతంత్రంగా విచారించి, బాధ్యతల నుంచి తొలగించే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు” అని పాస్టర్లు స్పష్టం చేశారు. CSI సైనడ్‌ ఉన్నతాధికారులు వెంటనే కడపకు వచ్చి CSI హైస్కూల్‌ ప్రాంగణం, సంబంధిత భూమి రికార్డులు, నిర్మాణ అనుమతులు, లీజు ఒప్పందాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల భద్రత, పాఠశాల విద్యా వాతావరణం దెబ్బతినకుండా నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్‌ ప్రధాన గేటుకు తాళం వేసి విద్యార్థుల రాకపోకలను, మధ్యాహ్న భోజనం సరఫరాను అడ్డుకునే పరిస్థితి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు దేవ సహాయం, మనోరంజన్‌, మోజస్‌, వి. ప్రభాకర్‌, షుబుద్ధిన్‌, ప్రేమ సాగర్‌, యన్‌. ప్రభాకర్‌, సీపీఐ నగర కార్యదర్శి యన్‌. వెంకట శివ, కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సిఎస్‌ఐ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. – సీనియర్‌ పాస్టర్‌ రెవరెండ్‌ ఐక్యత రావు మరియు పాస్టర్లు

కడప

హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పున్నమి ప్రతినిధి, ఆగస్టు 21: హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం తెలిపారు. అనంతరం ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, తదితర అంశాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.

కడప

త్వరలో మోగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా

త్వరలో మోగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముస్లిం సమాజం ఎన్నికల్లో నిర్వహించాల్సిన పాత్రపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్లను సమర్థవంతంగా వినియోగించుకునే విధానంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న పరిస్థితుల్లో, రానున్న ఎన్నికల్లో ముస్లిం సమాజం తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు ప్రయోజనకరంగా ఉండేలా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో గతంలో మాదిరిగా వివిధ పార్టీలకు మద్దతు ఇవ్వడమా, ఇండియా కూటమికి మద్దతు పలకడమా, లేక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేయడమా అనే అంశాలపై ముస్లిం సమాజం లోతుగా చర్చించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముస్లిం సమాజం రాజకీయ రంగంలో క్రమంగా వెనుకబడుతోందని, ముస్లిం సమస్యలపై తమ ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో అది అరణ్య రోదనగానే మిగిలిపోతోందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సమాజానికి చెందిన మేధావులు, మత పెద్దలు, మత నాయకులు, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారు సమావేశమై స్థానిక పరిస్థితులపై చర్చించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం సమాజ రాజకీయ కార్యాచరణకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సయ్యద్ సలావుద్దీన్ పిలుపునిచ్చారు. ఇట్లు: సయ్యద్ సలావుద్దీన్ ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

కడప

జన సందోహం మధ్య రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

జన సందోహం మధ్య రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు కడప, ఆగస్టు 21 – పున్నమి ప్రతినిధి: కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య సంతోషోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. చింతకొమ్మదిన్నె జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా, కడప నగర తొలి మేయర్‌గా, కమలాపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు. రవీంద్రనాథ్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో మహిళా నాయకురాళ్లు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎస్సీ సెల్ నాయకులు పులి సునీల్ కుమార్, వైఎస్సార్‌సీపీ కడప నగర యువ నాయకులు గుంటి నాగేంద్రతో పాటు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు

పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు పున్నమి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు సిహెచ్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్. వినోద్ కుమార్ మాట్లాడుతూ పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నతమైన పదవులు పొందాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కల్మషం లేని వ్యక్తి అని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అన్నదండగా ఉంటూ వారికి అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ ఉల్లా, త్యాగరాజు, సంపత్, కంచుపాటి బాబు, నరసింహ కుమార్, శాంసన్, ప్రభుదాసు, అయ్యవారయ్య, అజయ్, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కడప

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కడప: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 20, 2026 (గురువారం) ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన వివరాలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

కడప

మైదుకూరు ఎమ్మెల్యేపై ప్రజల్లో అసహనం!

మైదుకూరు ఎమ్మెల్యేపై ప్రజల్లో అసహనం! మైదుకూరు, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి): మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రజలకు మరింత అందుబాటులో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పలువురు కోరుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై జరుగుతున్న ఈ చర్చ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తికి కారణాలు ఏమిటన్నది, దీనిపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కడప

ప్రతి రైతుకూ 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి

ప్రతి రైతుకూ 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి పున్నమి, కడప : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పీఎం కిసాన్ తదితర ప్రయోజనాలు పొందేందుకు రైతులు 11 అంకెల విశిష్ట రైతు గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు. — పున్నమి, కడప