Friday, 2 October 2026

Tag: Karthik kadapa

కడప

స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్

స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ కడప ఆగస్టు 21 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నికల ప్రక్రియను జాప్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని లోకసత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కడప నగరం వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిందని, దాని వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత పరిస్థితులను పునరావృతం చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా వెంటనే ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని సి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పయ్యావుల వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు దేవర శ్రీకృష్ణ, లోకసత్తా నాయకులు రెడ్డయ్య, జోహార్ వలి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడప

బీసీల రిజర్వేషన్ల పెంపుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్

బీసీల రిజర్వేషన్ల పెంపుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్ కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్ కార్యాలయంలో బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో 33.33 శాతం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, తదుపరి జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా పనిచేసి టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చేల్లో రవి, బెస్త సంఘం అధ్యక్షుడు సుబ్బరాయుడు, హరికృష్ణ, ముదిరాజు సంఘం అధ్యక్షుడు ఓబయ్యతో పాటు పలువురు బీసీ కుల సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

కడప

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు పున్నమి ప్రతినిధి: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ దేవి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి కృపతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం నిండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తదితరులు ప్రజలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. యేకుల రాజేశ్వర్ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి

కడప

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని వైఎస్సార్‌సీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి యేకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కడప

స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది: పాకా సురేష్

స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది: పాకా సురేష్ పున్నమి ప్రతినిధి | ఆగస్టు 19, 2026 వైఎస్సార్ జిల్లా, కడప: కడప నగరంలో మాజీ మేయర్ పాకా సురేష్, మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకా సురేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేలా ప్రభుత్వం కొత్త రామాస్త్రాన్ని వదిలిందని ఆరోపించారు. గతంలోనూ స్థానిక ఎన్నికలను సక్రమంగా నిర్వహించని చరిత్ర చంద్రబాబుకు ఉందని అన్నారు. SIR ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కడపలోనే ముసాయిదా ఓటర్ల జాబితాలో దాదాపు 1.30 లక్షల ఓట్లపై స్పష్టత లేని పరిస్థితి ఉందని తెలిపారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా పాత జాబితాతో ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం, పచ్చ మీడియా మోసపూరిత ప్రచారం చేస్తున్నాయని పాకా సురేష్ విమర్శించారు. 2019లోనే వైఎస్ జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు జీవో ఇచ్చారని, అనంతరం టీడీపీ నేత ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించారని ఆరోపించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని తెలిసినా బీసీలను మభ్యపెడుతున్నారని అన్నారు. బీసీలను ‘బ్యాక్‌వర్డ్ క్లాస్’గా కాకుండా రాష్ట్రానికి ‘బ్యాక్‌బోన్’గా గుర్తించిన నాయకుడు వైఎస్ జగన్ అని పాకా సురేష్ పేర్కొన్నారు.

కడప

శంకరాపురంకు మార్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

శంకరాపురంకు మార్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా పున్నమి ప్రతినిధి | 19-08-2026 కడప: ప్రజల సౌకర్యార్థం కడప నగరంలోని సెవెన్ రోడ్స్ నుంచి శంకరాపురంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను మార్చినట్లు బ్రాంచ్ మేనేజర్ పావని లత తెలిపారు. శంకరాపురంలో నూతన బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, జోనల్ మేనేజర్ బంగారు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1997 సంవత్సరం నుంచి కడపలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నామని, పార్కింగ్‌తో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా బ్రాంచ్‌ను శంకరాపురంకు మార్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు గతంలో అందించిన ఆదరణ, సహకారాన్ని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. నూతన బ్రాంచ్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి మేనేజర్ మహేష్, కాయంపేట మేనేజర్ ఢిల్లీ బాబు, చంద్రగిరి మేనేజర్ సుధీర్, కొర్రపాడు మేనేజర్ ప్రేమ్ కుమార్, పుల్లూరు మేనేజర్ యోగేశ్వర్ రెడ్డి, పొద్దుటూరు మేనేజర్ చంద్రకళ, తిరుపతి క్లస్టర్ ఇంచార్జ్ పాణి ప్రసాద్, రాయచోటి మేనేజర్ శరత్ చంద్రతో పాటు బ్యాంకు సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కడప

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైఎస్సార్‌సీపీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ బలాన్ని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి యేకుల రాజేశ్వరి రెడ్డి పార్టీ కార్యకర్తగా పాల్గొని, పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

కడప

మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల సందడి

మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల సందడి పున్నమి ప్రతినిధి కడప: మంగళవారం సందర్భంగా కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగుల సందీప్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.