శంకరాపురంకు మార్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
పున్నమి ప్రతినిధి | 19-08-2026
కడప: ప్రజల సౌకర్యార్థం కడప నగరంలోని సెవెన్ రోడ్స్ నుంచి శంకరాపురంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను మార్చినట్లు బ్రాంచ్ మేనేజర్ పావని లత తెలిపారు.
శంకరాపురంలో నూతన బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, జోనల్ మేనేజర్ బంగారు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1997 సంవత్సరం నుంచి కడపలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు.
ప్రజలకు అవసరమైన అన్ని బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నామని, పార్కింగ్తో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా బ్రాంచ్ను శంకరాపురంకు మార్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు గతంలో అందించిన ఆదరణ, సహకారాన్ని ఇకపై కూడా కొనసాగించాలని కోరారు. నూతన బ్రాంచ్లో అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి మేనేజర్ మహేష్, కాయంపేట మేనేజర్ ఢిల్లీ బాబు, చంద్రగిరి మేనేజర్ సుధీర్, కొర్రపాడు మేనేజర్ ప్రేమ్ కుమార్, పుల్లూరు మేనేజర్ యోగేశ్వర్ రెడ్డి, పొద్దుటూరు మేనేజర్ చంద్రకళ, తిరుపతి క్లస్టర్ ఇంచార్జ్ పాణి ప్రసాద్, రాయచోటి మేనేజర్ శరత్ చంద్రతో పాటు బ్యాంకు సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
