38 ఏళ్ల సేవా ప్రస్థానానికి ఘన వీడ్కోలు ఉత్సవ కన్వెన్షన్‌లో జిల్లా రిజిస్ట్రార్ పి.వి.ఎన్. బాబుకు ఏటూరి రామచంద్రారెడ్డి ఘన సత్కారం
38 ఏళ్ల సేవా ప్రస్థానానికి ఘన వీడ్కోలు ఉత్సవ కన్వెన్షన్‌లో జిల్లా రిజిస్ట్రార్ పి.వి.ఎన్. బాబుకు ఏటూరి రామచంద్రారెడ్డి ఘన సత్కారం కడప, అక్టోబర్ 4: రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో 38 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో విశేష సేవలందించిన జిల్లా రిజిస్ట్రార్ పి.వి.ఎన్. బాబు పదవీ విరమణ సందర్భంగా కడపలోని ఉత్సవ కన్వెన్షన్‌లో ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటూరి రామచంద్రారెడ్డి, పి.వి.ఎన్. బాబును గజమాలతో ఘనంగా సత్కరించి, శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ అభినందనలు తెలిపారు. 38 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో వివిధ హోదాల్లో పి.వి.ఎన్. బాబు అందించిన సేవలను ఈ సందర్భంగా ఏటూరి రామచంద్రారెడ్డి కొనియాడారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ శాఖకు విశేష సేవలందించారని ప్రశంసించారు. సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, తన సేవా ప్రస్థానంలో ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారని పేర్కొన్నారు. 38 ఏళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానం అభినందనీయమని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఉత్సవ కన్వెన్షన్‌లో జరిగిన ఈ ఆత్మీయ అభినందన సభలో అధికారులు, ఉద్యోగులు, సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని పి.వి.ఎన్. బాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పి.వి.ఎన్. బాబు అందించిన సేవలను గుర్తుచేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. 38 ఏళ్ల విశిష్ట సేవలకు ఘనమైన సత్కారం… గజమాలతో ఆత్మీయ అభినందనలు… పదవీ విరమణ అనంతర జీవితానికి శుభాకాంక్షలు…








