సుమంత్ కేసులో సీఐ సస్పెండ్
జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో విధుల పట్ల అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేయడంతో పాటు, అతడిని పట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత సీఐని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.


