Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Etela Rajender

హైదరాబాద్

పేదల భూములపై కాంగ్రెస్ సర్కార్ దందా: ఈటల రాజేందర్

ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తూ పేదలు, రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ‘ధరణి’ పోయినా ప్రభుత్వ ధోరణి మారలేదని, ‘భూభారతి’ పేదల పాలిట ‘భూహారతి’గా మారిందన్నారు. హైడ్రా, పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే భూములకు ఫెన్సింగ్ వేసి వేలానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లిలోని IDL/గల్ఫ్ ఆయిల్ భూముల బదిలీ వెనుక ఫినిక్స్ కంపెనీ వ్యవహారం ఉందని పేర్కొన్నారు. పేదల భూములను కాపాడేందుకు పోరాడతామని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.