Monday, 28 September 2026

Tag: Cinema

నంద్యాల

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి 19 ఏళ్లు: ఆళ్లగడ్డలో ఘనంగా వేడుకలు

ఆళ్లగడ్డ:: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ రోజు ఆళ్లగడ్డలో మెగా యూత్ ఫోర్స్ నియోజకవర్గం ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ ఆళ్లగడ్డ నియోజకవర్గ కన్వీనర్ పసుల నరేంద్ర, ఉమ్మడి కర్నూలు జిల్లా స్పోక్స్ పర్సన్ షేక్ మహబూబ్ భాషలతో పాటు దూదేకుల బాబు, బావికడి గుర్రప్ప, బ్రహ్మేంద్ర కుమార్, కేశవ, రామిశెట్టి వెంకట సుబ్బయ్య, నాగేంద్ర, హాసన్, సలీం మరియు ఇతర మెగా అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల

చాగలమర్రి కుర్రోడి ‘ది కీ’ డెమో ఫిల్మ్ ట్రైలర్‌కు విశేష స్పందన

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన కె.ఎమ్‌.డి. వలి (K.M.D. Vali) దర్శకుడు కావాలనే సంకల్పంతో ‘ది కీ’ (The Key) అనే డెమో ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ఇటీవల ‘K.m.d.A.S’ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు రెండు రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు వలి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ డెమో ఫిల్మ్‌లో నటించిన ఖలందర్ (విలన్), ఖలీల్, కరిముల్లా, నాగరాజు నాయక్, పుల్లారెడ్డి, షరీఫ్, పఠాన్ నాసిర్‌లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.