Monday, 28 September 2026
  • Home  
  • ఠానూ నాయక్ ఉత్సవాలను జయప్రదం చేయండి- గిరిజన సంఘాల నాయకులు పిలుపు
- తెలంగాణ - మహబూబాబాద్

ఠానూ నాయక్ ఉత్సవాలను జయప్రదం చేయండి- గిరిజన సంఘాల నాయకులు పిలుపు

అక్టోబర్ 10 న జరుగుతున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి. -గిరిజన సంఘాల నాయకులు పిలుపు -ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్, సహారా రోడ్, ఎల్బీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంగా గిరిజనులు కళాకారులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల ఉద్దేశాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ ప్రతిపాదించిన తీర్మానంపై గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి రోజురోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇలాంటి గిరిజన ఉత్సవాలు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు దోహదపడతాయని అన్నారు. బంజారా గిరిజనులు మాట్లాడే గోర్ బోలి భాషకు లిపిని గుర్తించి రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజులపాటు చర్చించి పలు తీర్మానాలు చేసి భవిష్యత్తు ఐక్య ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఠానూ నాయక్ లాంటి గొప్ప పోరాట యోధుడి పేరుపై నంగారా ఉత్సవాలు జరపడం వారి పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయన్నారు. మహనీయులు, పోరాట వీరుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడి వీర మరణం పొందిన ఠానూ నాయక్ విగ్రహాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించాయి. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు 12 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, కళ్యాణ్ నాయక్, తిరుపతి నాయక్,సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్,గణేష్ నాయక్.లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు వడ్త్యా దాస్ రాం నాయక్, గోవింద్ నాయక్.ఏఐబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్, కార్యదర్శి బస్కి నాయక్.గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్రా శరత్ నాయక్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు,పద్మ.ప్రొఫెసర్ శంకర్ నాయక్, ప్రొఫెసర్ ఆర్ చంద్రు నాయక్,తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎం బాల్య నాయక్, వి రామ్ కుమార్, ఆంగోత్ కృష్ణ నాయక్, ఎస్ కిషన్ నాయక్, ఆర్ పాండు నాయక్, ఎం గోపి నాయక్, హరి, గోర్ బంజారా ఎంప్లాయిస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి శోబన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

అక్టోబర్ 10 న జరుగుతున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి.

-గిరిజన సంఘాల నాయకులు పిలుపు

-ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్.

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్, సహారా రోడ్, ఎల్బీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంగా గిరిజనులు కళాకారులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల ఉద్దేశాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ ప్రతిపాదించిన తీర్మానంపై గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి రోజురోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇలాంటి గిరిజన ఉత్సవాలు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు దోహదపడతాయని అన్నారు. బంజారా గిరిజనులు మాట్లాడే గోర్ బోలి భాషకు లిపిని గుర్తించి రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజులపాటు చర్చించి పలు తీర్మానాలు చేసి భవిష్యత్తు ఐక్య ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఠానూ నాయక్ లాంటి గొప్ప పోరాట యోధుడి పేరుపై నంగారా ఉత్సవాలు జరపడం వారి పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతాయన్నారు. మహనీయులు, పోరాట వీరుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడి వీర మరణం పొందిన ఠానూ నాయక్ విగ్రహాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించాయి. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు 12 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, కళ్యాణ్ నాయక్, తిరుపతి నాయక్,
సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్,గణేష్ నాయక్.
లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు వడ్త్యా దాస్ రాం నాయక్, గోవింద్ నాయక్.
ఏఐబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్, కార్యదర్శి బస్కి నాయక్.
గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు కొర్రా శరత్ నాయక్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు,పద్మ.
ప్రొఫెసర్ శంకర్ నాయక్, ప్రొఫెసర్ ఆర్ చంద్రు నాయక్,
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎం బాల్య నాయక్, వి రామ్ కుమార్, ఆంగోత్ కృష్ణ నాయక్, ఎస్ కిషన్ నాయక్, ఆర్ పాండు నాయక్, ఎం గోపి నాయక్, హరి, గోర్ బంజారా ఎంప్లాయిస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి శోబన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.