భారతీయ యాజమాన్యం దిశగా స్విగ్గీ అడుగు
స్విగ్గీని భారతీయుల యాజమాన్యం, నియంత్రణలో ఉండే కంపెనీగా మార్చే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపినట్లు సమాచారం. కంపెనీ యాజమాన్య నిర్మాణంలో మార్పునకు ఇది కీలక ముందడుగు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు అవసరమైన ప్రభుత్వ, నియంత్రణ సంస్థల అనుమతులు పొందాల్సి ఉంటుంది. సంబంధిత అనుమతులు లభించిన తర్వాత కొత్త యాజమాన్య నిర్మాణం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం స్విగ్గీ భవిష్యత్ వ్యాపార వ్యూహానికి కూడా కీలకంగా మారనుంది.


