Thursday, 1 October 2026

Tag: Award

నంద్యాల

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహేష్ గౌడ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

నంద్యాల : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నంద్యాల మున్సిపాలిటీ వాటర్ సెక్షన్‌లో ఫిల్టర్ బెడ్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్ గౌడ్ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందించడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆయనను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న మహేష్ గౌడ్‌ను సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందించారు.

నంద్యాల

మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధుకు ఉత్తమ సేవా పురస్కారం

మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధు కి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఆయన అందించిన సేవలను గుర్తించి సత్కరించడం పట్ల దేవస్థానం సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.