Thursday, 1 October 2026

Tag: Award

నంద్యాల

మహానందిలో వి.లక్ష్మీనారాయణకు ఘనంగా పదవీ విరమణ సత్కారం

మహానంది:శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో సేవలు అందించిన శ్రీ వి. లక్ష్మీనారాయణ పదవీ విరమణ పొందిన సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. పూర్వంలో శ్రీశైల దేవస్థానం నుంచి బదిలీపై వచ్చి మహానందిలో సేవలు అందించిన ఆయనను అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. వి.లక్ష్మీనారాయణ పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

నంద్యాల

ఏడుగురు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ

నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏడుగురు దివ్యాంగులకు రూ.56 వేల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ పుల్లయ్య (విజువల్లీ ఛాలెంజ్డ్) సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంధత్వాన్ని అధిగమించి బ్యాంకు ఉద్యోగం సాధించడమే కాకుండా, దివ్యాంగుల కోసం రూ.56 వేలు విరాళంగా అందించిన పుల్లయ్యను సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. దివ్యాంగుల సంక్షేమానికి, అవసరమైన ఉపకరణాలు, మందుల పంపిణీకి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

నంద్యాల: శారదా విద్యాపీఠం పాఠశాలలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు సౌజన్యంతో తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గిడుగు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, ప్రముఖ సాహితీవేత్త రమణమూర్తి, తెలుగు ఉపాధ్యాయులు వెంకటకృష్ణలకు ‘లయన్స్ క్లబ్ తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలు’ అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మేడా చంద్రశేఖర్, నిజాముద్దీన్, సోమేశుల నాగరాజు, కిరణ్ లాల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

నంద్యాల

శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం – బీసీఏ విభాగం ఓవరాల్ ఛాంపియన్

నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ డా. జి. హేమంత్ రెడ్డి, ప్రిన్సిపల్ డా. కె.వి.వి. సుబ్బయ్య, డీన్ ఏ.ఎస్. ప్రగతి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్, ఫిజికల్ డైరెక్టర్ వి. విజయకుమారి హాజరయ్యారు.చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సులభంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని, క్రీడలు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమష్టి కృషిని అలవర్చుతాయని వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు శారీరక దృఢత్వంపై దృష్టి సారించి మొబైల్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.మహిళలు, పురుషుల విభాగాల్లో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, షటిల్, క్యారమ్స్, లగోరి, త్రోబాల్ పోటీలలో సాధించిన పాయింట్ల ఆధారంగా బీసీఏ ద్వితీయ సంవత్సరం (BCA 2nd Year) విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచి డైరెక్టర్ హేమంత్ రెడ్డి చేతుల మీదుగా విజేత ట్రోఫీని అందుకున్నారు.

నంద్యాల

తెలుగు మాతృభాషా పరిరక్షణ మన అందరి బాధ్యత: శ్రీ రామకృష్ణ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం

నంద్యాల శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ‘తెలుగు భాషా దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు.కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షుడు, ప్రముఖ అడ్వకేట్ ఎం. శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగును సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారని, మాతృభాషను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమేనని వక్తలు పేర్కొన్నారు. యువత సాంకేతికతను ఉపయోగిస్తూ తెలుగు భాషను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు భాషా పరిరక్షణ ప్రతిజ్ఞ చేయగా, విశ్రాంత అధ్యాపకులు నీలకంఠం ఆచారి ప్రత్యేక కవిత వినిపించారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

దేశ ప్రగతికి ఆవిష్కరణలే చోదక శక్తులు: ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి

నంద్యాల :ఆధునిక సాంకేతిక యుగంలో ఆవిష్కరణలే దేశ ప్రగతికి చోదక శక్తులని శ్రీ రామకృష్ణ కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గత 10 రోజులుగా నిర్వహించిన ‘హ్యాకథాన్ – యాన్ ఇన్నోవేటర్ మారథాన్’ ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం ఉద్యోగాన్వేషణకే పరిమితం కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ఏ.ఎస్. ప్రగతి మాట్లాడుతూ విజేతలకు ‘అటల్ ఇంక్యుబేషన్ సెంటర్’ ద్వారా పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.పోటీలలో ప్రథమ బహుమతిని జయలక్ష్మి అండ్ టీం, ద్వితీయ బహుమతిని రోహిణి అండ్ టీం, తృతీయ బహుమతిని డి. పార్థసారథి గెలుచుకోగా.. విజేతలకు యాజమాన్యం ట్రోఫీలు, ప్రశంసా పత్రాలను అందజేసింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ జి. హేమంత్ రెడ్డి, న్యాయనిర్ణేతలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

నంద్యాల

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు నంద్యాలలో అభిమానుల సందడి

నంద్యాల పట్టణంలోని కాపురాక్స్ కార్యాలయం నందు మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో అభిమానుల సందడి నెలకొంది. కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. చిరంజీవి సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.చిరంజీవి నటన, సేవా కార్యక్రమాలు, అభిమానుల పట్ల చూపించే ఆప్యాయత తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అభిమానులు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్. సభ్యులు కామిని, మల్లికార్జున, చెన్నంశెట్టి శ్రీనివాసులు, సింహాద్రి, సురేష్‌బాబు, శ్రీహరి, శ్రీనివాసులు, మురళీమోహన్, సాయికుమార్, రాము, లింగం, మహేష్, సుబ్బరాయుడు, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో అభిమానులు ఉత్సాహంగా పాల్గొని చిరంజీవి జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.

నంద్యాల

మెగాస్టార్ సేవా స్ఫూర్తి.. ఘనంగా జన్మదిన వేడుకలు

నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా రెండో రోజు బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు.పెద్దదేవళాపురంలోని ఏకశిల అభయాంజనేయస్వామి ఆలయంలో చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెలుగోడు సర్వజన ఆసుపత్రిలో గర్భిణులు, రోగులకు బెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. బి.కోడూరులోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మెగా యూత్ ఫోర్స్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

నంద్యాల

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి గోళ్ళ రాజేష్ ఘన నివాళి

నంద్యాల.: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నంద్యాల

మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి కు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహానంది మండలంలో విశిష్ట సేవలు అందించిన మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో కనబరిచిన అంకిత భావానికి గుర్తింపుగా శనివారం రాష్ట్రమంత్రి ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఎస్పీ సునిల్ షోరాణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎస్సై రామ్మోహన్ రెడ్డిని పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.