వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 21@1:20 am (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 5 రోజులు వుండడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచార కార్యక్రమం జోరు పెంచారని పామూరు పట్టణ ప్రజాభిప్రాయం..
- అధిష్టాన టీడీపీ అమలు చేసిన సూపర్ సిక్స్ పధకాలు ఇంటింటికి చేరవేస్తూ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు..
- చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీ ఎల్లప్పుడు దీర్ఘకాళిక పధకాలను అమలు చేస్తుందని, వాటిద్వారా రాబోయే ముందు తరాలకు శాస్విత ఉపాధి చేకూరుతుంది ప్రచార కార్యక్రమంలో తెలిపారు..
పామూరు, నవంబర్ 21@1:20 am (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 5 రోజులు వుండడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచార కార్యక్రమం జోరు పెంచారని పామూరు పట్టణ ప్రజాభిప్రాయం.. అధిష్టాన టీడీపీ అమలు చేసిన సూపర్ సిక్స్ పధకాలు ఇంటింటికి చేరవేస్తూ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు.. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పార్టీ ఎల్లప్పుడు దీర్ఘకాళిక పధకాలను అమలు చేస్తుందని, వాటిద్వారా రాబోయే ముందు తరాలకు శాస్విత ఉపాధి చేకూరుతుంది ప్రచార కార్యక్రమంలో తెలిపారు.. మరో వైపు ప్రతిపక్ష వైసీపీ పార్టీ గత పాలనలో అమలు చేసిన నవరత్నపధకాల గురించి తెలుపుతూ ఓటర్లను జాగృతం చేశారు.. ఈ ప్రచార హామీలు ఎలా వున్నా, అధికార పార్టీ పరిపాలనలో వున్నప్పుడు, ప్రతిపక్షం గెలిచిన దాఖలాలు లేవని, అదే ఫలితం పునరావృతం అవుతుందని అధిష్టాన టీడీపీ పార్టీ నాయకులు అన్నారు.. మరో వైపు వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ,, 2001 లో జరిగిన స్థానిక పామూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిష్టాన పార్టీ ఉండి కూడా, గెలుపు వాకిలి తెరవలేదని వైసీపీ నాయకులు అన్నారు.. ఏది ఏమైనా ఈ మేజర్ సర్పంచ్ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో అని పామూరు పట్టణంలో అక్కడ పట్టినా స్థానిక ఎన్నికలదే చర్చ…