Tuesday, 29 September 2026

Tag: #apollospecialityhospitalsnellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుండెను కాపాడుకుందాం–జీవితాన్ని కాపాడుకుందాం -ప్రపంచ హృదయ దినోత్సవం – 2026

### గుండె చప్పుడు మిస్ కావొద్దు నెల్లూరు: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ నుంచి ఆసుపత్రి వరకు వాకథాన్ నిర్వహించారు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఓ. నందన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి యూనిట్ హెడ్ ఈగ విశ్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ షర్మిలీ, డాక్టర్ నాగభూషణం, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ జైగణేశ్, అనస్తీషియన్ డాక్టర్ మధు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. “డోంట్ మిస్ ఎ బీట్” సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ, గుండె జబ్బుల ప్రమాదాన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమమైన పరీక్షలు, సకాలంలో చికిత్స ద్వారా తగ్గించవచ్చన్నారు. ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఇబ్బంది, అసాధారణ అలసట, తల తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రోజూ వయస్సు, ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామం లేదా నడక చేయాలని, పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, గింజలు తీసుకోవాలని చెప్పారు. అధిక ఉప్పు, చక్కెర, అనారోగ్యకర కొవ్వులు, పొగాకు వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకొని, వైద్యుల సూచన లేకుండా మందులు ఆపకూడదన్నారు. మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, శారీరక చురుకుదనం చిన్న వయసు నుంచే అలవాటు కావాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధిత వ్యాధులు ప్రధాన ఆరోగ్య సమస్యగా కొనసాగుతున్నాయని, కొన్ని సమస్యలు స్పష్టమైన లక్షణాలు లేకుండానే మొదలవుతాయని తెలిపారు. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, అధిక ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య పరీక్షలపై పరస్పరం శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరారు. “గుండెను కాపాడుకుందాం–జీవితాన్ని కాపాడుకుందాం” అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.